ఇంటి స్థలం కోసం మౌనదీక్ష

by S Gopi |
ఇంటి స్థలం కోసం మౌనదీక్ష
X

దిశ, జగదేవపూర్: తన పేరు మీద ఉన్న భూమిని తనకు కాకుండా ఇతర వ్యక్తులు అడ్డుపడుతున్నారని ఓ వ్యక్తి మట్టి సత్యగ్రహా మౌనదీక్షకు దిగాడు. జగదేవపూర్ మండలంలోని తిగుల్ గ్రామానికి చెందిన నర్సింహ్మరెడ్డికి తన పేరు మీద ఉన్న 60 గజాల ఇంటి స్థలంలో ఇళ్లు కట్టుకుందామనుకుంటే ఆ స్థలంలో కాలనీకి చెందిన కొంతమంది గ్రామస్తులు మట్టి పోశారు. మట్టి తీయాలని కోరినా కాలనీ సభ్యులు తీయకపోవడంతో శుక్రవారం ఇంటి స్థలంలోనే మట్టి సత్యాగ్రహ మౌనదీక్షను చేపట్టారు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ భానుప్రకాష్ రావు ఘటనా స్థలానికి చేరుకుని నర్సింహ్మరెడ్డికి నచ్చజెప్పారు. శివరాత్రి పండుగ తర్వాత సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో నర్సింహ రెడ్డి దీక్షను విరమించారు.

Advertisement

Next Story