ఎర్లీ బర్డ్ కు సిద్దిపేట బల్దియాలో విశేష స్పందన

by Shiva |
ఎర్లీ బర్డ్ కు సిద్దిపేట బల్దియాలో విశేష స్పందన
X

ఐదు మున్సిపాలిటీల పరిధిలో రూ.6.98 కోట్ల ఆస్తి పన్ను వసూలు

దిశ, సిద్దిపేట ప్రతినిధి: వంద శాతం పన్న వసూలే లక్ష్యంగా 2023-24 ఆర్ధిక సంవత్సరం ప్రథామార్థంలో అస్తి పన్నులో ఐదు శాతం రాయితీతో అమలు చేసిన ఎర్లీ బర్డ్ స్కీంకు జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల పరిధిలో మిశ్రమ స్పందన వ్యక్తమైంది. జిల్లా పరిధిలోని చేర్యాల, దుబ్బాక, గజ్వేల్-ప్రజ్ఞాపూర్, హుస్నాబాద్, సిద్దిపేట మున్సిపాలిటీల పరిధిలోని 62,537 గృహ సముదాయాలు, వాణిజ్య సముదాయాలు, గృహ, వాణిజ్య సముదాయాలలకు గాను ఐదు శాతం రాయితీ పథకంలో 11,658 గృహ, వాణిజ్య సముదాయాలు నుండి రూ.6. 98 కోట్లు వసూలైంది.

సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో 34,118 గృహ సముదాయాలు, వాణిజ్య సముదాయాలు, గృహ, వాణిజ్య సముదాయాలకు గాను 8,869 నుండి రూ.5.69 కోట్లు (48.85 శాతం) వసూలైంది. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో 10,483 గృహ, వాణిజ్య సముదాయాలకు గాను 1065 నుండి రూ.73 లక్షలు (22.68శాతం) వసూలైంది. దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలో 5,963 గృహ, వాణిజ్య సముదాయాలకు గాను 346 నుండి రూ.21 లక్షలు (14.89శాతం) వసూలైంది. హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 7044 గృహ, వాణిజ్య సముదాయాలకు గాను 967 నుండి రూ.27 లక్షలు(21.86శాతం) వసూలైంది.

చేర్యాల మున్సిపాలిటీ పరిధిలలో 4,929 గృహ, వాణిజ్య సముదాయాలకు గాను 411 నుండి రూ.9లక్షలు (10శాతం) వసూలైనట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాలో ఈ ఆర్ధిక సంవత్సరం ప్రథమార్థంలో సిద్దిపేట మున్సిపాలిటీ ప్రథమ స్థానంలో అత్యధికంగా అస్తి పన్ను వసూలు కాగా, ద్వితీయ స్థానంలో గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ నిలిచింది.

Advertisement

Next Story