- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎస్సీ, ఎస్టీ కేసులు త్వరితగతిన పరిష్కరించాలి
దిశ, సంగారెడ్డి : ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన కేసులను త్వరితగతిన పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. శుక్రవారం సంగారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు , ఎస్పీ రూపేష్ ల ఆధ్వర్యంలో జిల్లా పోలీసు అధికారులు, రెవెన్యూ అధికారులు, ఎస్సీ, ఎస్టీ కుల సంఘాల నాయకులతో జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ కేసులు, ఎదుర్కొంటున్న సమస్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ జిల్లాలో పెండింగ్లో ఉన్న ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన పోలీసు రెవెన్యూ కేసులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు.
ఎస్సీ,ఎస్టీలను అనవసరంగా కేసుల్లో ఇరికించే పద్ధతులను పోలీసు సిబ్బంది విడనాడాలని ఫ్రెండ్లీ పోలీస్ లో భాగంగా ఎస్సీ, ఎస్టీలకు న్యాయం జరిగేలా రెవెన్యూ పోలీసు సిబ్బంది పని చేయాలని సూచించారు. మండలాల ప్రత్యేక అధికారులు, జిల్లా స్థాయి అధికారులు ఎస్సీ, ఎస్టీ గురుకుల పాఠశాలలను, వసతి గృహాలను తరచూ తనిఖీలు చేయాలని విద్యార్థులకు నాణ్యమైన భోజనం మెరుగైన విద్యను అందించేలా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీల వేధింపులకు గురి చేసే అధికారులపై కఠిన చర్యలు కమిషన్ తరపున తీసుకుంటామని హెచ్చరించారు.
అధికారులు హాస్టల్స్, పాఠశాలలు తనిఖీలు చేయాలి : కలెక్టర్
విద్యార్థులకు మంచి విద్య మంచి భోజనం అందించేందుకు హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ ను విధిగా అధికారులు తనిఖీ చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. భూమి సమస్యలపై ఆర్డీవోలతో ఎంక్వయిరీ చేయించి ఎస్సీ, ఎస్టీలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి గ్రామంలో సివిల్ రైట్స్ డే కార్యక్రమాలు జరిగేటట్లు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం జిల్లాలో చేపట్టిన కార్యక్రమాలు, వసతిగృహాల సమస్యల కోసం పరిష్కారం కోసం చేపట్టిన కార్యక్రమాలను జిల్లా కలెక్టర్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కు సభ్యులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్, లక్ష్మీనారాయణ, రేణిగుంట ప్రవీణ్, నీలాదేవి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి అఖిలేష్ రెడ్డి, డీవీఎంఎస్ సభ్యులు, అధికారులు, కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
- Tags
- SC and ST cases