ఎస్‌బీ‌ఐ చైర్మన్‌ను అరెస్టు చేయాలి : సీపీఎం

by Naresh |
ఎస్‌బీ‌ఐ చైర్మన్‌ను అరెస్టు చేయాలి : సీపీఎం
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి: ఎలక్టోరల్ బాండ్ల వివరాలను వెల్లడించాలని చెప్పిన సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించిన ఎస్‌బీఐ చైర్మన్‌ను అరెస్టు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు రాళ్లబండి శశిధర్ డిమాండ్ చేశారు. సీపీఎం కేంద్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం సిద్దిపేట ఎస్‌బీఐ బ్యాంక్ ఎదుట సీపీఎం నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...మోదీ ప్రభుత్వ ఒత్తిడితోనే ఎన్నికలు పూర్తయ్యే వరకు బాండ్ల వివరాలు వెల్లడించకుండా ఎస్‌బీ ఐ నాన్చివేత ధోరణి అవలంబిస్తోందన్నారు. బీజేపీ కార్పొరేట్ శక్తుల నుంచి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో వేల కోట్ల నిధులు సమకూర్చుకొని రాజకీయ అవినీతితో ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తోందన్నారు.

ఎస్‌బీఐ ప్రజల బ్యాంక్ అని బీజేపీ బ్యాంక్ కాదన్నారు. ఎన్నికల బాండ్ల పేరిట మోదీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. వెంటనే ఎలక్టోరల్ బాండ్ల వివరాలు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కాముని గోపాలస్వామి, జిల్లా కమిటీ సభ్యుడు చొప్పరి రవి కుమార్, దాసరి ప్రశాంత్, జాలి గపు శిరీష, సిద్దిపేట రూరల్ మండల కార్యదర్శి మామిడాల కనకయ్య, నాయకులు రెడ్డమైన అరవింద్, కొండం సంజీవ్, షారుక్, బాలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed