- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బహుజన రాజ్యం సాధించడం ఖాయం :RS Praveen Kumar
దిశ, బెజ్జంకి: ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పే కిసాన్ సర్కార్ అంటే రైతుల భూములు గుంజుకోవడమేనా అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధ్వజమెత్తారు. సోమవారం రెండో విడత బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా 141 రోజు యాత్ర సందర్భంగా మానకొండూర్ నియోజకవర్గంలోని బెజ్జంకి మండలం లో ఆయన పర్యటించారు. మండలంలోని రేగుల పల్లి, గుగ్గిళ్ళ, తోటపల్లి, లక్ష్మీపురం, గూడెం గ్రామాల్లో యాత్ర చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం తోటపల్లి రిజర్వాయర్ పేరుతో 1,600 ఎకరాల భూమిని సేకరించి, రిజర్వాయర్ కట్టకుండా, పేదల భూములు తిరిగి ఇవ్వకుండా రోడ్డుపాలు చేశారని ఆయన విమర్శించారు. కావేరి సీడ్స్ కంపెనీ పెట్టుకోడానికి భూమిని తిరిగి ఇచ్చిన ప్రభుత్వం పేదల భూమిని ఎందుకు తిరిగివ్వలేదని మండిపడ్డారు.
నియోజకవర్గంలోని వందలాది కుటుంబాలకు ఇల్లు లేవని, ఎమ్మెల్యేకు మాత్రం వందెకరాల ఫాంహౌస్ ఎలా వచ్చిందని ప్రశ్నించారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తామని చెప్పి, కేసీఆర్ కుటుంబీకులే ఇంద్రభవనాల వంటి ఇళ్లు కట్టుకున్నారని తెలిపారు. ఇప్పుడు మళ్లీ తెలంగాణ పేదల నుంచి దోచుకున్న సొమ్ము, దేశవ్యాప్తంగా తిరిగేందుకు ఖర్చు చేయనున్నారని పేర్కొన్నారు. మానకొండూర్ నియోజకవర్గంలో ఇప్పటికీ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేవని, అంగన్ వాడీ కేంద్రంలో కరెంట్ లేదని, పిల్లలకు చదువు చెప్పే టీచర్లు కూడా లేరని, స్థానిక ఎమ్మెల్యే మాత్రం ఏనాడు పట్టించుకోలేదని విమర్శించారు. మూడెకరాల భూమి పథకం కోసం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు ఆత్మాహుతి చేసుకున్న మాంకాళి శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించారు. ఇప్పటికీ ప్రభుత్వం శ్రీనివాస్ కుటుంబానికి భూమి ఇవ్వలేదని ప్రభుత్వ మోసాన్ని ఎండగట్టారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ బీసీల కులగణన చేసి, జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలంటే, బండి సంజయ్ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్నారు. బిజెపి, బీఆర్ఎస్ పార్టీలకు దమ్ముంటే వెంటనే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు. సంపూర్ణ మెజారిటీ కలిగి ఉన్న ఛత్తీస్ ఘడ్, జార్ఖండ్, తమిళనాడు రాష్ట్రాల వలే వాటా పెంచాలని డిమాండ్ చేశారు. లేదంటే ఓట్లు అడగడానికి రావద్దన్నారు. తోటపల్లి గ్రామంలో గుర్తుతెలియని దుండగులు బీఎస్పీ జెండా గద్దె కూల్చడానికి ఖండించారు. మా జెండాలు కూల్చితే, తర్వాత మీ గడీలు కూలుస్తామన్నారు. ఆరోగ్య శాఖ మంత్రి తన గ్రామంలో అంబేద్కర్ విగ్రహం కట్టడానికి అనుమతి రాకుండా చేస్తున్నారని, మరోపక్క సెక్రటేరియట్‌కు అంబేడ్కర్ పేరు పెట్టి మోసం చేయాలని చూస్తున్నారన్నారు. బహుజన రాజ్యం లో నిరుపేదలందరికీ ఎకరం భూమి, పది లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఉచితంగా కార్పొరేట్ స్థాయి విద్య, వైద్యం అందజేస్తామని తెలిపారు.
గుగ్గిల్ల, రేగులపల్లి లో ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. కాలనీల్లో తిరిగి ప్రజల బాధలను అడిగి తెలుసుకున్నారు. గ్రామ గ్రామాన పార్టీ జెండా ఆవిష్కరించారు. యాత్ర బేగంపేట, బెజ్జంకి, వడ్లూర్ గ్రామాల్లో కొనసాగనుంది. యాత్రలో రాష్ట్ర కార్యదర్శి నిశాని రాంచంద్రం, జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, మహిళా కన్వీనర్ సుమలత, నియోజకవర్గ అధ్యక్షులు ప్రభాకర్, మండల బీఎస్పీ అధ్యక్షులు లింగాల శ్రీనివాస్, నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
READ MORE
అల్వాల్ To ఆస్ట్రేలియా.. లుంగీల మాటున రూ.9 కోట్ల డ్రగ్స్ స్మగ్లింగ్