- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరో 48 గంటలు వర్ష సూచన
దిశ, సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మరో 48 గంటలు వర్ష సూచన ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సోమవారం టీపీసీసీ వర్కంగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎస్పీ చెన్నూరి రూపేష్ తో కలిసి సంగారెడ్డి మండల పరిధిలోని మంజీర బ్యారేజ్ ను పరిశీలించారు. బ్యారేజీకి నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో ఒక గేట్ మీటర్ ఎత్తు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ గత 45 గంటల నుంచి తెలంగాణ ప్రాంతంలో అధికంగా వర్షాలు కురిశాయని, కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వర్షాలు, సంగారెడ్డి జిల్లాలో 6.8 సెంటీమీటర్ల వర్షం పడిందన్నారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందన్నదని, ప్రత్యేకంగా ప్రాణనష్టం జరుగకూడదన్నారు. జిల్లాలో పాక్షికంగా ఇండ్లు కూలాయని, కొన్ని కుంటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని తెలిపారు. ముఖ్యంగా ఆందోల్, బొల్లారం, న్యాల్ కల్ ప్రాంతాలలో ప్రాణనష్టం జరుగకుండా కొన్ని కుటుంబాలని తరలించారని తెలిపారు. మంజీర బ్యారేజ్ సామర్థ్యం 0.5 టీఎంసీ ఉండగా పూర్తిగా నిండడం, ఒక గేటు సుమారు ఒక మీటర్ ఎత్తివేసినట్టు చెప్పారు. బ్యారేజీకి 2300 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంటే 3100 క్యూసెక్కులు ఔట్ ప్లో ఉందన్నారు.
జిల్లా యంత్రాంగం కలెక్టరేట్ లో కంట్రోలో రూం ఏర్పాటు చేసిందన్నారు. అదే విధంగా కరెంట్ కు సంబంధించి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వర్షాలు కురుస్తున్నందున జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందని, ప్రాణనష్టం జరుగకుండా జాగ్రత్తలు తీసుకుంటుందన్నారు. ఇండ్లు కూలిపోతే నష్టపరిహారం అందిస్తామని తెలిపారు. రాబోయే 48 గంటలు వర్ష సూచన ఉందని, దానికి అనుగుణంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాబోవు కాలంలో అంటు వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేకంగా వైద్యశాఖ అప్రమత్తంగా ఉందన్నారు. సింగూరు కాలువ తెగిపోయిందని వార్తలు వచ్చాయని అది కెనాల్ కాదు పిల్లకాలువ అన్నారు. అదే విధంగా సింగూరు కాలువలకు రూ.168 కోట్లతో సీసీ లైనింగ్ మంజూరు అయ్యిందని, 15 రోజుల్లో టెండర్ పూర్తవుతుందని తెలిపారు.