సీఎం కేసీఆర్ సారధ్యంలో దేవాలయాలకు పూర్వవైభవం.. మంత్రి హరీష్ రావు..

by Sumithra |
సీఎం కేసీఆర్ సారధ్యంలో దేవాలయాలకు పూర్వవైభవం.. మంత్రి హరీష్ రావు..
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : సీఎం కేసీఆర్ సారధ్యంలో దేవాలయాలను అద్బుతంగా తీర్చిదిద్దుకుంటున్నట్లు రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో ఆధ్యాత్మిక ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుదర్శన హోమం నిర్వహించారు. అదే విధంగా జిల్లాలో ధూప, దీప నైవేద్య పథకానికి ఎంపికైన 171 దేవాలయాల అర్చకులకు మంజూరు పత్రాలను మంత్రి హరీష్ రావు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ సారధ్యంలో యాదాద్రి దేవాలయం పునర్మిణంతో పాటుగా, కొండగట్టు, వేములవాడ, కొమురవెల్లి, కాళేశ్వరం తదితర దేవాలయలను అభివృద్ధి చేసకోవడానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు.

సిద్దిపేట జిల్లాలో రూ.40 కోట్లతో దేవాలయాల అభివృద్ధి పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. దూప దీప నైవెద్య పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 2500 దేవాలయాలను ఎంపిక కాగా జిల్లాలో 171 దేవాయాలు ఎంపికైనట్లు తెలిపారు. ధూప దీప నైవెద్య పథకంలో అందించే డబ్బులను రూ.6వేల నుండి రూ.10వేలకు పెంచినట్లు తెలిపారు. ఈ పథకంలో రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సరానికి రూ.75 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. రాష్ట్ర అభివృద్ధి, అభ్యున్నతి, రాష్ట్ర ప్రజలు, సీఎం కేసీఆర్ కోసం పూజలు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా అర్చకులు మంత్రి హరీష్ రావును గజమాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎఫ్ డీ సీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, జడ్పీ చైర్మన్ రోజాశర్మ, బీఆర్ఎస్ నాయకులు మచ్చ వేణుగోపాల్ రెడ్డి, కొండం సంపత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story