ఉపాధి హామీలో కూలీల సంఖ్యను పెంచాలి: కలెక్టర్ శరత్

by Shiva |
ఉపాధి హామీలో కూలీల సంఖ్యను పెంచాలి: కలెక్టర్ శరత్
X

దిశ, సంగారెడ్డి: జిల్లాలో హరితహారంలో కార్యక్రమంలో భాగంగా 25 లక్షల మొక్కలు పెట్టడానికి స్థలాలను గుర్తించాలని, నెలాఖరులోగా అంచనా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ శరత్ సంబంధిత అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీల సంఖ్యను పెంచాలని, యాక్టివ్ లేబర్లో కనీసం 60శాతంపైగా ఉండాలని తెలిపారు.

ఈనెల 20 నాటికి 24 మండలాల్లోని 639 పంచాయతీలల్లో 92,264 మంది కూలీలు పని చేస్తున్నారని తెలిపారు. ప్రతి పంచాయతీకి సరాసరిగా 144 మంది కూలీలు పని చేస్తున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలో ఈ సంవత్సరం హరితహారంలో భాగంగా 25 లక్షల మొక్కలు నాటేందుకు అన్ని ఏర్పాట్లతో పూర్తి సంసిద్ధతతో ఉండాలన్నారు. మన ఊరు.. మన బడి పనులు పూర్తైన వెంటనే రికార్డ్ చేయాలన్నారు.

ఆ పనులన్నింటికీ ఈనెల 29 లోగా రికార్డ్ చేసి, ఎఫ్టీవోలను జనరేట్ చేయాలని అధికారులకు సూచించారు. సీఎంఆర్ రైస్ డెలివరీ వంద శాతం పూర్తి కావాలని డీఎస్వోకు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీఆర్డీవో శ్రీనివాసరావు, డీఎస్వో వనజాత, డీసీవో ప్రసాద్, సివిల్ సప్లై స్ డీఎం సుగుణ భాయ్, డీపీవో సురేష్ మోహన్, వ్యవసాయ శాఖ జేడీ నరసింహారావు, ఇంజనీరింగ్ శాఖల ఈఈలు, డిఈలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story