నాడు బీటలు నేడు సిరుల పంటలు : మంత్రి

by Naresh |   ( Updated:2023-10-20 17:06:28.0  )
నాడు బీటలు నేడు సిరుల పంటలు : మంత్రి
X

దిశ, ములుగు,/గజ్వెల్: సమైక్య పాలనలో అభివృద్ధికి నోచుకోక చీకట్లో మగ్గిన పల్లెలు, బీటలు వారిన పంట పొలాలు నేడు ఆకు పచ్చని తోరణంలా ప్రగతి పథంలో పరుగులు పెడుతున్నాయని మంత్రి హరీష్ రావు ఆనందం వ్యక్తం చేశారు. పట్టణాలు, పల్లెల అభివృద్ధితో తెలంగాణ దేశానికే రోల్ మోడల్ గా నిలిచిందని హరీష్ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం శామీర్ పేట మండలం అంతాయి పల్లెలో ఏర్పాటు చేసిన గజ్వేల్ నియోజకవర్గ స్థాయి బీఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి హరీష్ రావు రాష్ట్ర అభివృద్ధిని ఉద్దేశించి మాట్లాడారు. సమైక్య పాలనలో అభివృద్ధికి ఆమడ దూరంలో మగ్గిపోయిన పల్లెలు స్వరాష్ట్రంలో కేసీఆర్ ఆలోచనలతో ప్రగతి పథంలో దూసుకుపోతున్నాయని మంత్రి ఆనందం వ్యక్తం చేశారు. సంబండ వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా సీఎం కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను రూపకల్పన చేసి అమలు పరుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇవాళ కూడవెళ్లి వాగు, హల్దీ వాగు నిండు కుండల్లా నీళ్లు ఎప్పుడు ఉంటున్నాయి. ఇవాళ రూ. 3500 కోట్ల వడ్లు పండిస్తున్నారు. నాడు నీళ్ల కోసం ఖాళీ బిందలతో ధర్నాలు చేసేవారు. గజ్వెల్ కు ఇంటింటికీ నీళ్లు ఇవ్వకపోతే నేను రాజీనామా చేస్తా అని చెప్పారు. ఇవాళ ఇచ్చి చూపారు. ఏ కార్యక్రమం అయిన గజ్వెల్ లో చేసి ఇవాళ రాష్ట్రం అంత అమలు చేశారు. దయచేసి ఇంత బాగా చేసిన కేసీఆర్ ఋణం తీర్చుకోవాలి అంటే రాష్ట్రంలో అతి ఎక్కువ మెజారిటీతో గెలిపించాలని మంత్రి హరీష్ రావు కోరారు. ఇవాళ అనేక గ్రామాల్లో మూకుమ్మడిగా మా ఓటు కారు కు, కేసీఆర్ కు అంటూ ఏకగ్రీవంగా తీర్మానాలు చేస్తున్నారు. రానున్న 35 రోజులు బాగా కష్టపడి మరోసారి కేసీఆర్ ను భారీ మెజారిటీతో గెలిపిద్దామన్నారు. గజ్వెల్ లో ఎవరు గెలిస్తే రాష్ట్రంలో అదే పార్టీ అధికారంలోకి వస్తుంది. గజ్వెల్ లో సీఎం కేసీఆర్ హ్యాట్రిక్, రాష్ట్రంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ పక్కా.’’ అని మంత్రి హరీష్ రావు అన్నారు.

Advertisement

Next Story

Most Viewed