- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముదిరాజ్ లు సంఘటితంగా పోరాడాలి
దిశ, శివ్వంపేట: ముదిరాజ్ లు సమిష్టిగా ఉండి పోరాటం చేయాలని ముదిరాజ్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అల్లాదుర్గం సురేష్ అన్నారు. గురువారం మండల కేంద్రమైన శివ్వంపేటలో హైదరాబాద్ తొలి మేయర్ దివంగత కొరివి కృష్ణ జయంతి వేడుకల సందర్బంగా ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షులు ముద్దగల్ల లక్ష్మీనర్సయ్య ఆధ్వర్యంలో ముదిరాజ్ సంఘం జెండా ఆవిష్కరించారు. అనంతరం దివంగత కొరివి కృష్ణ విగ్రహ ఏర్పాటుకు మార్కెట్ వద్ద భూమిపూజ చేశారు. నర్సాపూర్ - తూప్రాన్ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 60 శాతం ముదిరాజులకు సీఎం కేసీఆర్ ఒక్క అసెంబ్లీ స్థానం కూడా కేటాయించలేదని మండిపడ్డారు. నర్సాపూర్ నియోజకవర్గం టీడీపీ ఇంచార్జి హన్మంత్ రమణ రావు మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ముదిరాజుల సత్తా ఎంటో చూపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం జిల్లా సీనియర్ పిట్ల సత్యనారాయణ, సర్పంచులు సోము అశోక్, బండారి శ్యామల వెంకటేష్, రంగపల్లి పార్వతి సత్యం, తలారి శివులు, పిట్ల సుగుణ శ్రీనివాస్, ఉపసర్పంచులు పద్మ వెంకటేష్, నవీన్,పోల్దాస్ సంధ్య వెంకటస్వామి, నాయకులు గుణంగారి రాజు,ముద్దగల్ల రాజు, లస్కర్ నర్సిములు ముదిరాజ్ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.