Medak MP : మల్లన్న సాగర్ కట్టడానికి మట్టి ఎక్కడి నుంచి తెచ్చిండ్రు

by Aamani |
Medak MP : మల్లన్న సాగర్ కట్టడానికి  మట్టి ఎక్కడి నుంచి తెచ్చిండ్రు
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : మల్లన్న సాగర్ కట్టడానికి కాంట్రాక్టర్ మట్టి ఎక్కడి నుంచి తెచ్చారని మెదక్ ఎంపీ మాధవ నేని రఘునందన్ రావు సంబంధిత శాఖ అధికారి ని సూటిగా ప్రశ్నించారు. సిద్దిపేట కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అభివృద్దిపై కో ఆర్డినేషన్, మానిటరింగ్ సమావేశం (దిశ) సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి, అడిషనల్ కలెక్టర్లు శ్రీనివాస్ రెడ్డి, గరిమా అగర్వాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా పరిధిలో చేపట్టిన రిజర్వాయర్ల నిర్మాణానికి సదరు కాంట్రాక్టర్లు మట్టి ఎక్కడి నుంచి తీసుకొచ్చారని, తీసుకొచ్చిన మట్టికి సంబంధించి మైనింగ్ శాఖకు ఎంత రుసుము కట్టారని ప్రశ్నించారు. అదే విధంగా గత ఎంపీ నిధులతో చేపట్టిన పనులకు సంబంధించి పనులు పూర్తి కాక పోవడంపై అసహనం వ్యక్తం చేసిన ఎంపీ.. 10 సంవత్సరాల క్రితం చేపట్టిన పనులకు సంబంధించి నిధులు ల్యాప్స్ అయ్యా యా.. లేక క్యారీ ఫార్వర్డ్ అయితే ఎలా అవుతాయని ప్రశ్నించారు.

సీజనల్ వ్యాధుల పట్ల వైద్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కే లో ఇండియా పోగ్రామ్ లో స్టేడియం నిర్మాణం కోసం దాత ఇచ్చిన స్థలానికి సంబంధించి ఒరిజినల్ పత్రాలు ఎక్కడ ఉన్నాయని దుబ్బాక మున్సిపల్ కమిషనర్ ను, సంబంధిత శాఖ అధికారులను ప్రశ్నించారు. జిల్లాలో ఎంత మంది రేషన్ డీలర్ల డీలర్ షిప్ రద్దు చేశారు.. ఆ రేషన్ షాప్ ఏ డీలర్ కు అప్పగించారు.. కొత్త డీలర్ల కోసం నోటిఫికేషన్ వేశారా.. సివిల్ సప్లయ్ అధికారి తనూజను ప్రశ్నించారు. నిర్మాణాలు పూర్తయిన గ్రామ పంచాయతీ భవనాలను సెప్టెంబర్ 19 నాటికి ప్రారంభోత్సవానికి సిద్దం చేయాలన్నారు. అభివృద్ధి పనులకు సంబంధించి పథకం పేరు నిధుల వివరాలతో కూడిన శిలా ఫలకాలను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా అధికారులను ఆయా శాఖ లో పరిధిలో చేపట్టిన కార్యక్రమాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు కొత్తగా వచ్చినట్లు సమాధానం చెప్పగా.. అందరూ కొత్త గా వచ్చినట్లు చెబితే.. సమావేశం ఎందుకు అని ఎంపీ రఘునందన్ రావు ఒకానొక సందర్భంలో అసహనం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.

Advertisement

Next Story