'రాజ్యాంగానికి ప్రతిరూపం బీఆర్ అంబేద్కర్‌' : MLA Raghunandan Rao

by Vinod kumar |   ( Updated:2023-01-26 11:56:50.0  )
రాజ్యాంగానికి ప్రతిరూపం బీఆర్ అంబేద్కర్‌ : MLA Raghunandan Rao
X

దిశ, దుబ్బాక: దుబ్బాక మండల కేంద్రంలో గురువారం జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పాల్గొన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగానికి ప్రతి రూపం, అణగారిన వర్గాలకు ఆశాదీపం బీఆర్ అంబేడ్కర్‌‌ అని అన్నారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్‌ ఆలోచనలే.. కేంద్ర ప్రభుత్వ విధానాలకు స్ఫూర్తి అని ఎమ్మెల్యే అన్నారు.


అణగారిన వర్గాల అభ్యున్నతికి ప్రత్యేకంగా పథకాలు రూపొందిస్తూ.. సామాజిక న్యాయం దిశగా కృషి చేస్తున్నామని తెలిపారు. పట్టణంలోని అన్ని పాఠశాల విద్యార్థులు ఒకే చోట కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. దుబ్బాక గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మారిన తర్వాత ప్రజల జీవన విధానంలో, ఆలోచన విధానంలో, పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి విషయంలో ప్రజలు అందరి ఆలోచన విషయంలో మార్పులు వస్తున్నాయన్నారు. ఎమ్మెల్యేగా గెలిచి 24 నెలలు మాత్రమే అవుతుంది. అయిన దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి రూపురేఖలను మార్చడానికి కావలసిన విధంగా ప్రయత్నాలు చేస్తున్నానన్ని తెలిపారు.

దుబ్బాక ను ప్లాస్టిక్ రహితంగా మార్చుకోవాలి..

పట్టణంలో ప్లాస్టిక్ పట్ల ప్రజలందరికీ అర్ధమయ్యేలా మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్ అధికారులు ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రయత్నం చెయ్యాలి. అలాగే ప్రతి పాఠశాలలో విద్యార్థులతో ప్రతిజ్ఞ చెప్పించి దుబ్బాకని ప్లాస్టిక్ రహితంగా మార్చాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పాతూరి గణేష్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ గన్నె వనిత భూంరెడ్డి, కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి: ప్రజల స్వేచ్ఛాయుత జీవనానికి బీఆర్ అంబేద్కర్ కారకుడు : ఎమ్మెల్యే రఘునందన్ రావు


Advertisement

Next Story