- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఢిల్లీ గద్దల నుండి తెలంగాణను కాపాడుకుద్దాం.. మంత్రి కేటీఆర్
దిశ, దౌల్తాబాద్: సీఎం కేసీఆర్కు అండగా నిలిచి.. ఢిల్లీ గద్దల నుండి తెలంగాణను కాపాడుకుంద్దామని మంత్రి కేటీఆర్ అన్నారు. దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా దౌల్తాబాద్ మండల కేంద్రంలో కేటీఆర్ ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం కేటీఆర్ మాట్లాడతూ.. లుచ్చమాటలతో దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన రఘునందన్ రావుకు అసెంబ్లీ ఎన్నికలల్లో బుద్ది చెప్పి ఇంటికి. పంపించాలన్నారు. వ్యవసాయానికి 3 గంటల కరెంట్ సరిపోతుందని రేవంత్ రెడ్డి అంటున్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్మి మోసపోయామని.. మరో సారి నమ్మితే రాష్ట్రం 50 సంవత్సరాలు వెనక్కి వెళ్లే ప్రమాదం ఉందన్నారు.
మహిళలకు సౌభాగ్య లక్ష్మీ పేరిట రూ.3 వేలు అందించడంతో పాటుగా, దశల వారీగా ఫెన్షన్లు పెంచుతామని హామీనిచ్చారు. బీజేపీ నాయకులకు డిల్లీ నుండి, కాంగ్రెస్ నాయకులకు కర్ణాటక నుండి పైసలు వస్తున్నాయని, ఆ డబ్బులతో ఎన్నికలల్లో గెలువాలని చూస్తున్న ఆ రెండు పార్టీలకు 30 వ తారీఖున బుద్ది చెప్పాలన్నారు. జనవరిలో కొత్త రేషన్ కార్డు మంజూరు చేస్తామని హామీనిచ్చారు. ఎంపీ ప్రభాకర్ రెడ్డి కత్తిపోటుకు గురై పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డాడని.. ప్రజలు ఓట్ల పొట్లతో ప్రతిపక్షాలకు బుద్ది చెప్పాలన్నారు. కారు గుర్తుకు ఓటేసి సీఎం కేసీఆర్ ను మూడో సారి ముఖ్యమంత్రిని చేసుకోవడంతో పాటుగా, దుబ్బాక ను మరింత అభివృద్ధి చేసుకుంద్దామన్నారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి పాటు పడే బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు అండగా నిలిచి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, కార్యకర్తలు, భారీ సంఖ్యలో పాల్గొన్నారు.