- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఏం సహాయ నిధి నిరుపేదలకు అండ.. మంత్రి హరీశ్ రావు
దిశ, సిద్దిపేట ప్రతినిధి: సీఎం సహాయ నిధి నిరుపేదలకు అండగా నిలుస్తోందని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని 242 మంది లబ్దిదారులకు రూ.77,93, 500 సీఎం సహాయ నిధి చెక్కులను హరీశ్ రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ అసుపత్రిలో అన్ని రకాల వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయని, అత్యవసరమైతేనే ప్రైవేట్ అసుపత్రికి వెళ్లాలన్నారు. ఈ ఏడాదిలో సిద్ధిపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో క్యాత్ ల్యాబ్ వైద్య సేవలు అందుబాటులోకి తేనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి, నంగునూరు మార్కెట్ కమిటీ చైర్మన్ రాగుల సారయ్య, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్ రెడ్డి, సర్పంచ్ ఉమేష్, కౌన్సిలర్లు, టీఆర్ ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Also Read......