ప్రభుత్వ కార్యాలయ నిర్మాణాలకు స్థలాలు పరిశీలించిన మంత్రి దామోదర..

by Kalyani |
ప్రభుత్వ కార్యాలయ నిర్మాణాలకు స్థలాలు పరిశీలించిన మంత్రి దామోదర..
X

దిశ, చౌటకూర్: మండల కేంద్రమైన చౌటకూర్ తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలకు నూతన పక్కా భవనాలు మంజూరు అయినట్లు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. బుధవారం ఆయన మండల కేంద్రాన్ని, తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలను సందర్శించి వాటి భవన నిర్మాణాల కోసం స్థలాన్ని పరిశీలించారు. స్థలాన్ని సర్వే నిర్వహించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. స్మశాన వాటిక పక్క నుంచి రోడ్డు నిర్మాణం చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. సుల్తాన్ పూర్ గ్రామంలో పోలీస్ స్టేషన్, ప్రభుత్వ ఆసుపత్రి, ప్రభుత్వ కార్యాలయాల భవన నిర్మాణానికి కృషి చేసిన దామోదర రాజనర్సింహకు మండల ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ పాండు, తహసీల్దార్ మన్నె కిరణ్ కుమార్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నత్తి దశరథ్, ఉపాధ్యక్షులు రామా గౌడ్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వర్కల రమేష్, ప్రధాన కార్యదర్శి ఆగమయ్య, మండల సీనియర్ నాయకులు మహిపాల్ రెడ్డి, సార గోవర్ధన్ ముదిరాజ్, జైపాల్ రెడ్డి, కైసర్, ఈశ్వర్ గౌడ్, ఆంజనేయులు ముదిరాజ్, మల్లికార్జున్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story