- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Collector : ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా వైద్య సేవలు అందించాలి
దిశ, పాపన్నపేట : ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా ఆసుపత్రికి వచ్చే రోగులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వైద్య సిబ్బందిని సూచించారు. శుక్రవారం మండల పరిధిలోని పొడిచన్పల్లి పీ.హెచ్.సీ ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పీహెచ్ సీ లోని రక్త పరీక్షల గది, మందులు అందజేసే గది, ఇన్ పేషెంట్ వార్డ్, బెడ్స్, టాయిలెట్స్, వాక్సినేషన్ ను పరిశీలించారు. ప్రతి రోజూ హాస్పిటల్ కు ఎంత మంది రోగులు వస్తున్నారని, ఈ నెలలో ఎన్ని డెలివరీల లక్ష్యం ఉందని, ఇప్పటిదాకా ఎన్ని చేశారని సంబంధిత వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. రోగులతో మాట్లాడుతూ వారి సమస్యలను తెలుసుకున్నారు. హాస్పిటల్ వైద్య సిబ్బంది పనితీరును వారి ద్వారా తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. హాస్పిటల్ కు వచ్చే రోగులకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలని, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై వివరించాలని సూచించారు. సమయానుగుణంగా వైద్య సిబ్బంది సేవలు అందించాలని, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని ఈ సందర్భంగా హెచ్చరించారు. హాస్పిటల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.