Medak Collector : అర్హత కలిగిన రైతులందరికీ రుణమాఫీ

by Aamani |
Medak Collector : అర్హత కలిగిన రైతులందరికీ రుణమాఫీ
X

దిశ, మెదక్ ప్రతినిధి : అర్హత కలిగిన రైతులందరికీ రుణ మాఫీ జరుగుతుందని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మెదక్ మండలం ర్యాలమడుగు లో బుధవారం రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అర్హత కలిగిన రైతులందరికీ ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్వహిస్తున్న రుణమాఫీ పథకం అమలు జరుగుతుందని జిల్లా కలెక్టర్ రైతులకు భరోసా కలిగించారు. సాంకేతిక, ఇతర కారణాలవల్ల రుణమాఫీ జరగానీ వారు స్థానిక అధికారులను కలిసి ఫిర్యాదు చేయాలన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ లో సంప్రదించి సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. ప్రభుత్వ ప్రతిష్టాత్మక రుణమాఫీ పథకం రెండు దఫాలుగా ఇప్పటికే అమలైందని రుణమాఫీ పథకం వల్ల జిల్లా రైతులు చాలా ఆనందంగా ఉన్నారన్నారు. ర్యాలమడుగు రైతులు ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం గ్రామంలో పర్యటిస్తూ పారిశుద్ధ్య కార్యక్రమాలను, అంగన్వాడి కేంద్రంను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, గ్రామస్తులు, రైతులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story