రికార్డ్ ధర పలికిన బీరంగుడా వినాయకుడి లడ్డు ధర... రూ. 10 లక్షల ఐదు వేలు

by S Gopi |   ( Updated:2022-09-09 05:22:12.0  )
రికార్డ్ ధర పలికిన బీరంగుడా వినాయకుడి లడ్డు ధర... రూ. 10 లక్షల ఐదు వేలు
X

దిశ, అమీన్ పూర్: బీరంగుడా శివాలయం చౌరస్తాలో వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించే వినాయక ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. నిమజ్జన కార్యక్రమానికి ముందు వేలం వేసిన లడ్డు కొనుగోలు చేసేందుకు భక్తులు పోటీపడ్డారు. ప్రతి సంవత్సరం లడ్డు సైజును పెంచడం ఈ ఉత్సవ కమిటీ ప్రత్యేకత. అందులో భాగంగా ఈ సంవత్సరం 25 కేజీల లడ్డుకి వేలంపాట నిర్వహించారు. బీరంగూడ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతుండడంతో లడ్డును కైవసం చేసుకోవడానికి ఇద్దరు రియల్ వ్యాపారులు పోటాపోటీగా వేలంపాటలో పాల్గొన్నారు. చివరికి 10.05 లక్షల రూపాయలకు రియల్ వ్యాపారి రామిరెడ్డి కైవసం చేసుకున్నారు. ఇక్కడ లడ్డుతోపాటు ఐదు వెండి నాణేలను వేలం వేయడం ఆనవాయితీగా వస్తోంది. లడ్డుతోపాటు ఐదు వెండి నాణేలు సైతం మంచి ధర పలికాయి. అనంతరం నిర్వహించిన వినాయకుడి ఊరేగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా శోభాయమానంగా ప్రారంభమైంది. గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నుండి తెప్పించిన బ్యాండ్ మేళం చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. చిన్నా పెద్ద తేడా లేకుండా భక్తులందరూ సాంస్కృతిక కార్యక్రమాలతో నృత్యాలతో అలరించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ నిర్వాహకులు శశిధర్ రెడ్డి, శ్రీనివాస్, సుధాకర్, ఉత్సవ కమిటీ సభ్యులు, భారీగా భక్తజనం పాల్గొన్నారు.

Also Read : మరోసారి రికార్డు సృష్టించిన బాలాపూర్ లడ్డూ.. ఎంత పలికిందో తెలుసా?


Advertisement

Next Story

Most Viewed