కొమురవెల్లి మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

by Mahesh |
కొమురవెల్లి మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు
X

దిశ, కొమురవెల్లి: ప్రముఖ శైవక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శనివారం రాత్రి నుంచి కొమురవెల్లి కి చేరుకున్న భక్తులు ఆదివారం వేకువజామున కొనేరులో స్నానం ఆచరించి, తదితర మొక్కలు చెల్లించుకున్నారు. అనంతరం కొండపై ఉన్న రేణుక ఎల్లమ్మ, నల్లపోచమ్మ అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సంక్రాంతి పండుగ కావడంతో అందరికీ వరుస సెలవులు వచ్చాయి. దీంతో భక్తుల తాకిడి మరింత పెరిగింది. కాగా భారీగా తరలివచ్చిన భక్తులకు ఆలయ ఈఓ బాలాజి, ఏఈవో‌లు వైరాగ్యం అంజయ్య,గంగ శ్రీనివాస్, సూపరింటెండెంట్ నీల శేఖర్, ప్రధాన అర్చకులు మహాదేవుని మల్లికార్జున్, అర్చకులు,ఒగ్గు పూజారులు, ఆలయ సిబ్బంది భక్తులకు సేవలందించారు.

Advertisement

Next Story

Most Viewed