- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తొమ్మిదేళ్లలో కేసీఆర్ కుటుంబమే బాగుపడ్డది.. దరిపల్లి చంద్రం
దిశ, సిద్దిపేట ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ కుటుంబమే అభివృద్ధి చెందిందే తప్ప.. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గానికి న్యాయం జరగలేదని పీసీసీ సభ్యుడు దరిపల్లి చంద్రం అన్నారు. గడపగడపకు కాంగ్రెస్ పేరిట బుధవారం కాంగ్రెస్ నాయకులు ఇంటింటికి తిరుగుతూ ఆరు గ్యారంటీలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాల ను సీఎం కేసీఆర్ కాపీ కొట్టారన్నారు.
బీఆర్ఎస్ తాజా మేనిఫెస్టోల ప్రస్తావించిన పథకాలను 9 ఏళ్లుగా ఎందుకు అమలు చేయలేదని సూటిగా ప్రశ్నించారు. ప్రజలకు కలువని సీఎం కేసీఆర్ ఎన్నికలు రాగానే పథకాల పేరిట ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్, బీజేపీ పార్టీలను నమ్మరన్నారు. ఈ కార్యక్రమంలో మజార్ మల్లిక్, శ్రీనివాస్ రెడ్డి, మధు, గయాజుద్దీన్, రాకేష్, రఘుపతి, అనిల్, నవాజ్, జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.