హరిత తెలంగాణ సృష్టికర్త.. కేసీఆర్: నీలం మధు

by S Gopi |
హరిత తెలంగాణ సృష్టికర్త.. కేసీఆర్: నీలం మధు
X

దిశ, పటాన్ చెరు: పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యమ నేత కేసీఆర్ ముఖ్యమంత్రిగా పనిచేస్తూ తెలంగాణను హరిత తెలంగాణగా మార్చారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నీలం మధు ముదిరాజ్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం పురస్కరించుకుని పటాన్ చెరు మండలం చిట్కుల్ గ్రామంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. జన్మదిన సందర్బంగా కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ సమైక్య పాలనలో పుష్కలమైన వనరులు ఉన్నా అభివృద్ధికి నోచుకోని తెలంగాణను స్వరాష్ట్ర పాలనలో ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నాడన్నారు. అందుబాటులో ఉన్న వనరులను సరైన రీతిలో వినియోగించుకుని ప్రజల ఆకాంక్షల కనుగుణంగా సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు ఆమలుచేస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచాడని కొనియాడారు. పరాయి పాలనలో సరైన సాగునీరు లేక కరెంటు రాక పంటలు పండక రైతులు ఇక్కట్లు పడేవారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో సాగునీటి రంగానికి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి కాలేశ్వరం వంటి ప్రాజెక్టులు నిర్మించి వ్యవసాయంలో మేటిగా నిలిపిన అపార భగీరథుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

ప్రజల సంక్షేమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కి సాటి వచ్చే నేత దేశంలో మరెవరు లేరన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న సుపరిపాలనతో దేశం మొత్తం కేసీఆర్ లాంటి నేత ప్రధాని కావాలని ఎదురుచూస్తుందన్నారు. దేశంలోనే విజన్ ఉన్న తొలి ప్రధానిగా ముఖ్యమంత్రి కేసీఆర్ గద్దెనెక్కటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దేశ్ కీ నేతగా దేశ రాజకీయాల్లో కీలక ఘట్టాన్ని రూపొందించబోయే మహా నాయకుడు కేసీఆర్ అని ఆయన్నే చాలామంది ఆదర్శంగా తీసుకుంటారని తెలిపారు.కుల, మతాలకు అతీతంగా రాష్ట్రంలో అన్నివర్గాల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న రైతుభీమా, రైతుబంధు షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి, 24 గంటలు కరెంట్ వంటి పథకాలు దేశం మొత్తం అమలయ్యేలా ప్రజలు కోరుకుంటున్నారని వెల్లడించారు.

రాష్ట్రంలో ప్రతీ ఒక్క యువత సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఎదిగేలా చేస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. దేశానికి ఏం చేస్తారని చాలామంది వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని, గతంలో కూడా తెలంగాణ రాష్ట్ర సాధన లో ఎన్నో కష్టాలు కోర్చి ప్రత్యేక తెలంగాణ సాధించారన్నారు. ఈసారి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ని ఆశీర్వదిస్తారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో పొట్టి నారాయణ రెడ్డి, వెంకటేష్,మురళీ, రాజ్ కుమార్,వెంకటేశ్, ఎండీ ఖదీర్, గారెల మల్లేష్, నారబోయిన శీను, సత్య నారాయణ, మన్నే రాములు,గోపాల్,మహేష్,భాస్కర్, శ్రీనివాస్, రాఘవేంద్ర, ఎన్.ఎం.ఆర్ యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed