Disha effect.. పంపిణీ చేసిన కల్యాణలక్ష్మి చెక్కులు

by Kalyani |
Disha effect.. పంపిణీ చేసిన కల్యాణలక్ష్మి చెక్కులు
X

దిశ, నర్సాపూర్: 'దిశ' కథనానికి అధికారులు స్పందించారు. పెండింగ్ లో ఉన్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను శుక్రవారం స్థానిక రైతు వేదికలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత రెడ్డి చేతుల మీదుగా 81 మంది లబ్ధిదారులకు 81 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. అయితే ఈనెల 8వ తేదీన ‘దిశ’ పత్రికలో ఎనిమిది నెలలు గడుస్తున్న పంపిణీకి నోచుకోని చెక్కులు మూడు సార్లు కళ్యాణ లక్ష్మి రిటర్న్ అనే శీర్షిక ప్రచురితమైంది. దీనికి స్పందించిన అధికారులు నర్సాపూర్ నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న చెక్కులను ఎమ్మెల్యే సునీత రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. దీంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story