జూనియర్ కార్యదర్శులు మౌన దీక్ష..

by Sumithra |
జూనియర్ కార్యదర్శులు మౌన దీక్ష..
X

దిశ, మెదక్ ప్రతినిధి : జూనియర్ పంచాయతీ కార్యదర్శులు మౌన దీక్ష చేపట్టారు. పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేయాలని బుధవారం మౌన దీక్ష చేశారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల దీక్షలకు మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడీ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ సంఘీభావం తెలిపారు. గ్రామాల్లో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు వచ్చిన తరవాత చాలా మార్పు వచ్చిందని అన్నారు.

వారు ఎంతోనిబద్దతతో పని చేయడం వల్ల నేడు గ్రామాలు జాతీయ స్థాయిలో అవార్డులు పొందే స్థాయికి అభివృద్ది చెందాయని వివరించారు. గ్రామాల అభివృద్ధిలో కీలకంగా మారిన కార్యదర్శుల రెగ్యులర్ చేయాలనీ కోరారు. ఈ నిరసనలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల అధ్యక్షుడు కుమార్, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ రెడ్డి సభ్యులు పద్మ, ఫర్హీన్, జగదీష్, సంగమేశ్వర్, వీణ, రాజీ రెడ్డి, సంతోషిని , రోజా, దిగంబర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed