- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నాపై ఐటీ రైడ్స్ కుట్ర..భయపడేది లేదు..
దిశ, మెదక్ ప్రతినిధి: ఓటమి భయంతో ఐటీ రైడ్స్ చేసేందుకు కుట్ర చేస్తున్నారని మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. సోమవారం మెదక్ పట్టణం లో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సందీప్ రమాకాంత్ ఆధ్యర్యంలో సుమారు వెయ్యి మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... ఇప్పుడే నాకు సమాచారం వచ్చింది.. ఐటీ అధికారులు దాడి చేసేందుకు కుట్ర చేస్తున్నారని తెలిసిందన్నారు. కాంగ్రెస్ నేతల పైనే ఎందుకు ఐటీ దాడులు చేస్తున్నారని, మరి సీఎం కేసీఆర్, కేటీఆర్, రాష్ట్ర మంత్రుల పై ఎందుకు ఐటీ దాడులు జరగడం లేదని ప్రశ్నించారు. కుట్ర పూరిత ఆలోచన ప్రభుత్వం చేస్తుందని, మైనంపల్లి ఐటీ దాడులతో బయపడేది లేదని అన్నారు. ప్రభుత్వ భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్న దేవేందర్ రెడ్డి పై ఐటి దాడులు ఎందుకు కావడం లేదని ప్రశ్నించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత ప్రభుత్వ భూములు కాజేసిన వారితో పాటు మెదక్ నుంచి జింకలను తీసుకు వెళ్లిన వారిని జైలుకు పంపడం ఖాయం అన్నారు. ప్రజా సేవ తప్ప ఎక్కడ తన వద్ద అక్రమ ఆస్తులు లేవని చెప్పారు. స్థానిక బీఆర్‌ఎస్ నేతలు తను గుండా, రౌడీ అంటూ ఆరోపణలు చేస్తున్నారని, ఇప్పటి వరకు ఎక్కడ రౌడీ, గుండా గిరి చేశానో చెప్పాలని అన్నారు. ఓటమి భయంతో అధికార పార్టీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. పదేళ్ల అధికారంలో మెదక్ కు చేసింది ఏమిటని నిలదేశారు. కనీసం ఔటర్ రోడ్డు ఏర్పాటు చేయలేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరవాత రూ. 12 లక్షల దళిత బంధు, మహిళకు ఉచిత బస్సు రవాణాతో పాటు ఆరు గ్యారంటీలు పక్కాగా అమలు చేస్తుందని చెప్పారు. ఇన్నాళ్లు ప్రజల్ని మభ్య పెట్టే పాలన చేశారని, ఇక నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని, మీ ఓటమి ఖాయం అయిందని అన్నారు. ఈ జీవన్ రావు, వెంకట రమణ, పాండరి గౌడ్, రాజేందర్ రెడ్డి, లల్లు, మాణిక్యం, లాక్కర్సు శ్రీనివాస్, శివ, సుభాష్ తదితరులు పాల్గొన్నారు.
Read More..