తల్లి మందలించిందని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య..

by Kalyani |
తల్లి మందలించిందని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య..
X

దిశ, చిన్నశంకరంపేట: తల్లి మందలించిందని ఇంటర్ విద్యార్థి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గురువారం చిన్నశంకరంపేట మండల పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన త్యాపల ప్రసాద్ (17), మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి 11 సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. గత కొన్ని రోజుల నుంచి ప్రసాద్ కళాశాలకు వెళ్లడం లేదు. ఎప్పుడూ ఫోన్ లో మాట్లాడుతుండే వాడు.

ఈ క్రమంలోనే అలా మాట్లాడొద్దని కళాశాలకు వెళ్లి బుద్దిగా చదువుకోవాలని తల్లి మందలించింది. కాగా గురువారం ఉదయం 5:30 గంటల ప్రాంతంలో ప్రసాద్ తన తల్లిని టీవీఎస్ ఎక్సెల్ బండిపై కంపెనీ వద్ద వదిలి వెళ్లాడు. మధ్యాహ్నం పని ముగించుకొని తల్లి 2.40 గంటలకు ఇంటికి వెళ్లి చూడగా రూంలో ప్రసాద్ ఇంటి పైకప్పుకు చీరతో ఉరేసుకొని కనిపించాడు. తల్లి స్థానికుల సహాయంతో ప్రసాద్ ను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా డాక్టర్ పరీక్షించి అప్పటికే ప్రసాద్ మృతి చెందినట్లు తెలిపాడు. బుద్దిగా చదువుకోమని మందలించడంతోనే ప్రసాద్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లి ఫిర్యాదులో పేర్కొంది. సంఘటన స్థలానికి స్థానిక ఎస్సై సుభాష్ గౌడ్ శవాన్ని పంచనామా నిర్వహించి రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed