తక్షణ సహాయ చర్యలు చేపట్టాలి : మంత్రి పొన్నం ప్రభాకర్

by Naresh |
తక్షణ సహాయ చర్యలు చేపట్టాలి : మంత్రి పొన్నం ప్రభాకర్
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : సిద్దిపేట జిల్లాలో ఆకస్మికంగా కురిసిన వడగళ్ల వాన వలన ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం సిద్దిపేట పట్టణంలో అకస్మాత్తుగా వడగండ్లతో కూడిన భారీ వర్షం పడడంతో వృక్షాలు పడిపోయి, విద్యుత్ స్తంభాల వైర్లు తెగిపోయాయి. విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయిందని జిల్లా కలెక్టర్, సంబంధిత శాఖల జిల్లా అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ ఫోన్ లైన్ లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా విద్యుత్ సరఫరాను కూడా త్వరగా పునరుద్ధరించాలని, పడిపోయిన చెట్లను తొలగించాలని ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed