ఎమ్మెల్యే కనుసన్నల్లోనే అక్రమ మట్టి రవాణా..

by Sumithra |
ఎమ్మెల్యే కనుసన్నల్లోనే అక్రమ మట్టి రవాణా..
X

దిశ, నర్సాపూర్ : నర్సాపూర్ ప్రాంతంలోని చెరువుల్లో అక్రమంగా మట్టి తరలిస్తున్న మట్టి దొంగలను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు నర్సాపూర్ ఆర్డీవో కార్యాలయంలో ధర్నా చేశారు. క్రమంగా మట్టి తరలిస్తున్న వారి పై చట్టపరంగా చర్యలు తీసుకునే వరకు ఆందోళన విరమించబోమని హెచ్చరించారు. ఘటనా స్థలానికి చేరుకొని తహసీల్దార్ ఆంజనేయులు నచ్చ చెప్పినప్పటికీ ఆందోళన విరమించలేదు. దాంతో తహసీల్దార్ ఆంజనేయులు పోలీసులకు ఇరిగేషన్ అధికారులకు మట్టి రవాణా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడంతో ఆందోళన విరమించారు. అంతకుముందు పట్టణంలో తిరుగుతూ దుకాణాలను బందుచేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు ఆంజనేయులు గౌడ్, బీజేపీ రాష్ట్ర నాయకుడు గోపి, కౌన్సిలర్ గోడ రాజేందర్ తదితరులు మాట్లాడుతూ నర్సాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి కనుసన్నలోనే అక్రమంగా ఇసుక మట్టి భూమాఫియాలు జరుగుతున్నాయని ఆరోపించారు. చెరువు నుంచి 200 నుంచి 300 కోట్ల వరకు మట్టి అక్రమంగా తరలించాలని ఆరోపించారు.

గతంలో నర్సాపూర్ చెరువు నుంచి మట్టి తరలించే సమయంలో ఇద్దరు మత్స్యకారులు చనిపోయారని గుర్తు చేశారు. అలాగే గురు బుధవారం నర్సాపూర్ ప్రాంతం నుంచి మట్టి తరలించే సమయంలో కారు టిప్పర్ ఢీకొని పట్టణ చంద్రబాబు మహిళా మృతి చెందడం బాధాకరమని అన్నారు. గత మూడు నెలల నుంచి నర్సాపూర్ ప్రాంతంలో విచ్చలవిడిగా అక్రమంగా మట్టి ఇసుక రవాణా జరుగుతుందని జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. నర్సాపూర్ ప్రాంతంలో ప్రభుత్వ అసైన్డ్ భూములు ఆక్రమణకు గురవుతున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీశైలం యాదవ్, మల్లేష్, బీజేపీ నాయకులు గుండం శంకర్, రమేష్ గౌడ్, ప్రేమ్ కుమార్, బాలరాజు తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story