రోజుకు 24 గంటలు ఉంటాయని నాకు తెలుసు : మైనం పల్లి

by Naresh |   ( Updated:2023-11-11 09:47:48.0  )
రోజుకు 24 గంటలు ఉంటాయని నాకు తెలుసు : మైనం పల్లి
X

దిశ, రామాయంపేట/ నిజాంపేట్: ఎన్నికల ప్రచారంలో భాగంగా మైనంపల్లి రోహిత్ శనివారం దామరచెరువు , దామరచెరువు తండా, కోనాపూర్, కోనాపూర్ తండా, కట్రియల్, శివాయపల్లీ గ్రామాలలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రోజుకు 24 గంటలు ఉంటాయని తనకు తెలుసు అని అన్నారు. దీనిపై బీఆర్ఎస్ నాయకులు తనపై ఎన్నో విమర్శలు చేసిన అది ప్రజల్లో తన బలం చూసి ఓర్వలేక తనపై మసి పూసి మారాడికాయ చేస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధి చేతకాని నాయకులకు మాటలే తూటాలు అని ఆయన ఎద్దేవ చేశారు. రానున్న కాలంలో బీఆర్ఎస్ పతనమై కాంగ్రెస్ గద్దెనెక్కడం ఖాయమని ధీమ వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed