హాట్సాఫ్.. సునీతారెడ్డి

by Shiva |
హాట్సాఫ్.. సునీతారెడ్డి
X

కత్తి చూపించి మహిళ మెడలోంచి పుస్తెల తాడు చోరీ

నిందితుడిని పోలీసులకు పట్టించిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్

దిశ, నర్సాపూర్: ఆటోలో ఎక్కిన ఓ ప్రయాణికురాలిపై ఆటో డ్రైవర్ కత్తి చూపించి పుస్తెలతాడు దొంగిలించిన ఘటన నర్సాపూర్ సమీపంలోని బీవీఆర్ఐటీ కళాశాల వద్ద శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..సంగారెడ్డి జిల్లా తాళ్లపల్లికి చెందిన ఆటోడ్రైవర్ తన ఆటోలో ఓ మహిళా ప్రయాణికురాలిని ఎక్కించుకొని నర్సాపూర్ వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఆటో బీవీఆర్ఐటీ కళాశాల సమీపంలోకి రాగానే ఆటోను పక్కకు ఆపి సదరు మహిళకు కత్తి చూపించి పుస్తెలతాడును లాక్కున్నాడు.

దీంతో సదరు మహిళ గట్టిగా కేకలు వేయగా అటు వైపు నుంచి వెళ్తున్న రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డి తన వాహనాన్ని ఆపి ప్రయాణికురాలితో మాట్లాడింది. వేంటనే ఆమె సహాయకులు ఆటోడ్రైవర్ ను పట్టుకుని అతని నుంచి పుస్తెలతాడుని తీసుకుని బాధితురాలికి అప్పజెప్పింది. అనంతరం చోరీకి పాల్పడిన ఆటో డ్రైవర్ ను పోలీసులకు అప్పగించారు.

Advertisement

Next Story

Most Viewed