సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా దంచి కొడుతున్న వానలు..

by Mahesh |
సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా దంచి కొడుతున్న వానలు..
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో వర్షాలు దంచికొడుతున్నాయి. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా శనివారం ఉదయం 8 గంటల నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు సరాసరి 7.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 2024 జూన్ 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 1వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా 62.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో సాధారణ వర్షపాతం 46.7 సెంటీమీటర్ల కాగా 34.1 శాతం అధిక వర్షపాతం నమోదైనట్లు జిల్లా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగా సెప్టెంబర్ 1వ తేదీ ఉదయం 8:30 గంటల నుంచి 10:00 సుమారు గంటన్నర వ్యవధిలో జిల్లా వ్యాప్తంగా 3.4 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం తెలుస్తుంది. కొమురవెల్లి, దూల్మిట్ట, నంగునూర్, మద్దూర్, జగదేవపూర్, మర్కూక్, కోహెడ, చిన్నకోడూరు, కుకునూరు పల్లి, కొండపాక, తొగుట, గజ్వేల్, బెజ్జంకి, వర్గల్, రాయపోల్, ములుగు, అక్కన్నపేట, సిద్దిపేట అర్బన్ మండలాల్లో భారీ వర్షపాతం నమోదైంది. చేర్యాల, నారాయణరావు పేట, సిద్దిపేట రూరల్, దౌల్తాబాద్, దుబ్బాక, మిరుదొడ్డి, అక్బర్ పేట భూంపల్లి మండలాల్లో మోస్తరు వర్షపాతం నమోదు కాగా హుస్నాబాద్ మండలం లో తేలికపాటి వర్షపాతం నమోదైంది.

మండలాల వారిగా వర్షపాతం వివరాలు..

సిద్దిపేట జిల్లాలో సరాసరి 7.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అక్కన్నపేట మండలంలో అత్యధికంగా 10.7 సె.మీ వర్షపాతం నమోదు కాగా అత్యల్పంగా అక్బర్ పేట భూంపల్లి మండలంలో 2.5 సె.మీ వర్షపాతం నమోదైంది. దుబ్బాక మండలం లో 5.9 సె.మీ, సిద్దిపేట రూరల్ మండలం లో 6.1 సె.మీ, చిన్నకోడూరు మండలం లో 8.0 సె.మీ, బెజ్జంకి మండలం లో 7.0 సె.మీ, కోహెడ మండలం లో 8.5 సె.మీ, హుస్నాబాద్ మండలం లో 5.8 సె.మీ, నంగునూరు మండలం 9.7 సె.మీ, సిద్దిపేట అర్బన్ మండలం లో 7.4 సె.మీ, తొగుట మండలం లో 6.9 సె.మీ, మిరుదొడ్డి మండలం లో 5.7 సె.మీ, దౌల్తాబాద్ మండలం లో 5.4 సె.మీ, రాయపోల్ మండలంలో 5.8 సె.మీ, వర్గల్ మండలం లో 7.3 సె.మీ, ములుగు 6.5 సె.మీ, మర్కూక్ మండలం లో 7.7 సె.మీ, జగదేవపూర్ మండలం లో 8.6 సె.మీ, గజ్వేల్ మండలం లో 6.7 సె.మీ, కొండపాక మండలం లో 7.7 సె.మీ, కొమురవెల్లి మండలం లో 9.5 సె.మీ, చేర్యాల మండలం లో 6.8 సె.మీ, మద్దూరు మండలం లో 8.4సె.మీ, నారాయణ రావు పేట మండలం లో 6.2 సెం.మీ, దూల్మిట్ట మండలం లో 8.9 సె.మీ, కుకునూరుపల్లి మండలంలో 7.7 సె.మీ వర్షపాతం నమోదైంది. ఇప్పటి వరకు జిల్లా పరిధిలోని 26 మండల పరిధిలో 18 మండలం లో అత్యధిక వర్షపాతం నమోదు కాగా 8 మండలం లో సాధారణ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు విడుదల చేసిన గణాంకాల ప్రకారం తెలుస్తోంది.

సిద్దిపేట నుంచి హుస్నాబాద్ వెళ్లే రోడ్డు బ్లాక్

భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలోని వాగులు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో పలు రహదారుల వెంట రాకపోకలకు పోలీసులు నిలిపి వేశారు. బద్దిపడగ వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నందున సిద్దిపేట నుంచి హుస్నాబాద్ వెళ్లే రోడ్డు బ్లాక్ చేశారు. సిద్దిపేట నుండి హుస్నాబాద్ వెళ్లే వాహన దారులు రంగదాంపల్లి చౌరస్తా నుంచి రంగీలా దాబా రాముని పట్ల కొత్తపల్లి గ్రామం నుండి హుస్నాబాద్ కు వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. నంగునూరు మండలం ఖాతా వాగు, సికిందలాపూర్ వాగు ప్రవాహం రోడ్డు పై నుంచి వెళ్తున్న క్రమంలో ఖాతా నుంచి జిల్లపల్లి, దర్గపల్లి నుంచి సికిందలాపూర్ రోడ్డు పై రాకపోకలు నిలిపి వేశారు. అక్కన్న పేట మండలం గొల్లపల్లి నుంచి మల్లంపల్లి రోడ్డులోని లో లెవల్ కల్వర్టు నుంచి వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో రాకపోకలు నిలిపి వేశారు.

చేర్యాల మండల పరిధిలో తాడూరు, చిట్యాల గ్రామాల మధ్య వాగు రోడ్డుపై నుంచి ప్రవహిస్తున్న నేపథ్యంలో రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిలిపి వేశారు. కడవేర్గు చెరువు నుంచి వాగు ఉధృతం ప్రవహిస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని చేర్యాల ఎస్ ఐ నిరేష్ గ్రామస్తులను హెచ్చరించారు. బెజ్జంకి, పోతారం, ముత్తన్న పేట గ్రామాల మధ్య కల్వర్టుల పై నుంచి ఉధృతంగా ప్రవాహం కొనసాగుతుంది. బస్వాపూర్ బ్రిడ్జి, అక్కెనపల్లి చెక్ డ్యాములను హుస్నాబాద్ ఏసీపీ సతీష్ పరిశీలించారు. తొగుట మండలం వెంకట్రావు పేట వద్ద వాగు రోడ్డుపై నుంచి ప్రవహిస్తుంది. దౌల్తాబాద్ మండలంలో దొమ్మాట వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది.

Advertisement

Next Story

Most Viewed