Jeans style : అదిరే జీన్స్.. అట్రాక్టివ్ లుక్స్..! వీటికి రాగి బటన్స్ మాత్రమే ఎందుకుంటాయంటే..

by Javid Pasha |   ( Updated:2024-10-28 13:45:46.0  )
Jeans style : అదిరే జీన్స్..  అట్రాక్టివ్ లుక్స్..! వీటికి రాగి బటన్స్  మాత్రమే ఎందుకుంటాయంటే..
X

దిశ, ఫీచర్స్ : వావ్ ఏం స్టైల్ గురూ.. అని ఏ కాలేజీ పోరగాడన్న అన్నాడంటే ఎదుటి వ్యక్తి ఏదో వెరైటీ జీన్స్ ప్యాంటే వేసుకొని వచ్చుంటాడు దాదాపు! ఎందుకంటే ప్రస్తుతం అదే కదా ట్రెండ్ (trend). ఒకప్పటిలా బ్యాగీ ప్యాంట్లు, లొడాస్ లొడాస్ షర్టులు ఇప్పుడెవరూ వేసుకోవడం లేదు. పెన్సిల్ కట్ అని, టైట్ ఫిట్ అని, బూట్ కట్ అని రకరకాల జీన్స్ ధరించడమే యంగ్‌స్టర్స్‌కు నచ్చుతోంది. మరికొందరు అక్కడక్కడ హోల్స్ పడిన చింపిరి జీన్స్ కూడా వేసుకుంటుంటారు. ఇప్పుడిది మరింత మోడ్రన్ స్టైల్ అన్నమాట. ఇక ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఏంటంటే.. జీన్స్ ప్యాంటుకు రాగి బటన్స్ మాత్రమే ఎందుకుంటాయో తెలుసా? అంటున్నారు కొందరు. దీనిపై నిపుణులు ఏం చెప్తున్నారో చూద్దాం.

19 శతాబ్దంలోనే అలా..

నిజానికి జీన్స్‌ను (Jeans pants) 19వ శతాబ్దంలో జాకబ్ డేవిడ్ (Jacob David) అనే వ్యక్తి కనిపెట్టాడు. అప్పట్లో వ్యవసాయ కార్మికులకోసం ఎక్కువకాలం మన్నికగా ఉండేలా, ముఖ్యంగా చుట్టూ జేబులు ఉండేలా ప్యాంట్లను తయారు చేయాలన్న ఆలోచనే ఇందుకు కారణం. అలా అందుబాటులోకి వచ్చిన జీన్స్ కాలక్రమంలో మార్పులు చెందుతూ వచ్చింది. ఎన్ని రకాల ఫ్యాషన్లు పాతబడిపోయినా జీన్స్‌ను మాత్రం ఈ ప్రపంచంలో ఓల్డెస్ట్ ఫ్యాషన్ అని మాత్రం ఎవరూ అనడం లేదు. ఎందుకంటే కాలంతో పాటు జీన్స్ కూడా ఆధునిక హంగులను, రంగులను సంతరించుకుంటూ యువతను అట్రాక్ట్ చేస్తూనే ఉన్నాయి.

అసలు కారణం ఇదే

మని జీన్స్ ప్యాంటకు కేవలం రాగి బటన్స్ (Copper buttons) మాత్రమే ఎందుకని ఎక్కువగా ఉంటాయంటే.. అవి చిరిగి పోకుండా ఉండేందుకు వాటి మొట్ట మొదటి సృష్టికర్త డేవిస్ రాగి రివెట్లను (rivets) అప్పట్లోనే ఉపయోగించారట. జేబులు, బటన్ హోల్స్ వంటి ఫ్యాబ్రిక్‌పై ఎక్కువ ఒత్తిడి ఉండే ప్రదేశాల్లో వీటిని అమర్చుతారు. ఇందుకు ప్రధాన కారణం సుస్థిరత, మన్నిక అంటున్నారు నిపుణులు. అడిషనల్‌గా జీన్స్ వివిధ భాగాలను కలపడానికి అంటే బటన్స పెట్టుకోవడానికి రివెట్లను యూజ్ చేస్తారు. దీంతో జీన్స్ షర్టులు గానీ, ప్యాంట్లు గానీ త్వరగా చిరిగిపోవు. రాగి బటన్స్ పెట్టడానికి గల అసలు కారణం ఇదే అంటున్నారు ఫ్యాషన్ డిజైనర్లు.

Advertisement

Next Story