Roll Rida: ఒకే ఒక్క ఫొటోతో సోషల్ మీడియాని షేక్ చేస్తున్న రోల్ రైడా.. పక్కన ముగ్గురు అమ్మాయిలు?

by Prasanna |   ( Updated:2024-10-28 08:40:38.0  )
Roll Rida: ఒకే ఒక్క ఫొటోతో సోషల్ మీడియాని షేక్ చేస్తున్న రోల్ రైడా.. పక్కన ముగ్గురు అమ్మాయిలు?
X

దిశ, వెబ్ డెస్క్: ర్యాప్ సాంగ్స్ తో మంచి పేరు తెచ్చుకున్న రోల్ రైడా ( Roll Rida ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ తో తర్వాత రోల్ రైడా కెరియర్ పూర్తిగా మారిపోయింది. అల వైకుంఠపురంలో మూవీలో ర్యాప్ సాంగ్ తో చాలా ఫేమస్ అయ్యాడు. ప్రస్తుతం సింగర్ గా, ర్యాపర్ గా రెండింటిలో దూసుకుపోతున్నాడు. ఇటీవల రోల్ రైడా కాకినాడ కాజా అనే ర్యాప్ పాటతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. ఆ సూపర్ హిట్ అయింది. ఈ పాటలో రోల్ రైడా, శుభశ్రీ అందర్ని మెప్పించారు.

అయితే, తాజాగా రోల్ రైడా ( Roll Rida ) ముగ్గురు బిగ్ బాస్ బ్యూటీలతో ఫోటో భానుశ్రీ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయడంతో ఆ ఫోటో నెట్టింట హల్చల్ చేస్తుంది. ఈ ఫొటోలో రోల్ రైడాతో పాటు అరియనా గ్లోరీ, భానుశ్రీ, శుభశ్రీ ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురు బిగ్ బాస్ కి వెళ్లి వచ్చిన వారే. ఇప్పుడు సీరియల్స్, షోలు, సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు.

రోల్ రైడా బిగ్ బాస్ సీజన్ 2లో, అరియనా గ్లోరీ బిగ్ బాస్ సీజన్ 4లో, భానుశ్రీ బిగ్ బాస్ సీజన్ 2లో, శుభశ్రీ రాయగురు బిగ్ బాస్ 7లో పార్టిసిపేట్ చేసింది. బిగ్ బాస్ భామలతో రోల్ రైడా ( Roll Rida ) ఒకే ఫొటోలో ఉండటంతో ఫ్యాన్స్ తో పాటు నెటిజన్స్ కూడా షాకవుతున్నారు.

Read More : మెగా హీరోపై మనసు పారేసుకున్న టాలీవుడ్ యంగ్ బ్యూటీ.. పిచ్చిగా లవ్ చేస్తున్నానంటూ కామెంట్స్


Read More : Tollywood: పదేళ్ళ నుంచి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతున్న ఏకైక టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా?

Advertisement

Next Story

Most Viewed