- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Congress: సీంపై చేసిన వ్యాఖ్యలకు హరీష్ రావుపై ఫిర్యాదు.. మెట్టు సాయికుమార్
దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao)ను వెంటనే అరెస్ట్(Arrest) చేయాలని తెలంగాణ ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్(Mettu Saikumar) అన్నారు. గాంధీ భవన్(Gandhi Bhavan) లో మీడియా సమావేశం(Press Meet)లో మాట్లాడిన ఆయన.. హరీష్ రావుపై ఫిర్యాదు(Complaint) చేసినట్లు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. సీఎం(CM) అనే రాజ్యాంగబద్ద పదవిని అగౌరవపరిచే విధంగా హరీష్ రావు మాట్లాడారని, ఇది చట్ట వ్యతిరేఖమని, అందుకే ఆయనపై బేగం బజార్ పీఎస్(Begambazar Police Station) లో సెక్షన్ 352, 353/1, 353/2 కింద ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. ఒక శాసన సభ్యునిగా ఉన్న మీరే ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తే.. సామాన్య ప్రజానీకానికి మీరిచ్చే సందేశం ఏమిటని ప్రశ్నించారు. హరీష్ రావు "చీప్ మెన్"(Cheep man) అని బహుషా కేసీఆర్(KCR) ను అనబోయి.. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని అన్నట్లు ఉన్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి గత పది నెలల్లో సీఎం పదవికి ఎంతో ఉన్నతిని తెచ్చారని, ఈ విషయం ప్రజలకు తెలుసన్నారు.
సీఎం అనే పదానికి క్రెడిబిలిటీ(Credibility) తీసుకొచ్చిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నారు. అలాగే హరీష్ రావు వ్యాఖ్యలు తెలంగాణ సభ్యసమాజాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని, సీఎం రేవంత్ రెడ్డికి అసెంబ్లీ సాక్షిగా క్షమాపణ చెప్పాలని డిమాండ్(Demand) చేశారు. లేని పక్షంలో హరీష్ రావును అసెంబ్లీ సమావేశాలకు రానివ్వకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. తక్షణమే రేవంత్ రెడ్డికి భేషరత్తుగా క్షమాపణ(Sorry) చెప్పి, ఆయన అన్న పదాలను వెనక్కి(Withdraw) తీసుకోవాలని చెప్పారు. హరీష్ రావు అహంకారపు మాటలతో సీఎం అనే పదాన్ని అవమానించారని మండిపడ్డారు. హరీష్ రావు మీ మామ గారిని చీప్ మెన్, చీటింగ్ మెన్, కేర్ లెస్ మెన్ అని ఏదైనా అనుకోవచ్చని.. అది మీ వ్యక్తిగతం కానీ రాష్ట్రానికి సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డిని ఏదైనా ఊరుకునేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావును వెంటనే అరెస్ట్ చేయాలని హైదరాబాద్ నగర పోలీసులను(HYD City Police) కోరుతున్నానని సాయికుమార్ అన్నారు.