Jharkhand elections: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ కు షాక్..!

by Shamantha N |
Jharkhand elections: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ కు షాక్..!
X

దిశ, నేషనల్ బ్యూరో: జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల(Jharkhand assembly elections) వేళ కాంగ్రెస్ కు భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ జార్ఖండ్ వర్కింగ్ ప్రెసిడెంట్ మనస్ సిన్హా భారతీయ జనతా పార్టీ(BJP) లో చేరారు. ఎన్నికలకు కొన్నివారాల ముందు టికెట్ నిరాకరించడంతో కాంగ్రెస్ ని వీడి బీజేపీలో చేరారు. బీజేపీ జార్ఖండ్ వర్కింగ్ ప్రెసిడెంట్ రవీంద్ర రే, అసోం సీఎం హిమంత బిశ్వశర్మ సమక్షంలో మనస్ సిన్హా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. తాను 27 ఏళ్లుగా కాంగ్రెస్‌కు చెమటను, రక్తాన్ని, కన్నీళ్లను ధారపోశానని.. కానీ, ఆ పార్టీ మాత్రం కార్యకర్తలకు ఏ మాత్రం గౌరవం ఇవ్వలేదని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ స్ఫూర్తితో బీజేపీలో చేరుతున్నానని వెల్లడించారు. 22 ఏళ్లుగా కాంగ్రెస్‌లో ఉన్నానని, పార్టీ పరిస్థితి తనకు తెలుసని హిమంత బిశ్వశర్మ అన్నారు.

మనస్ సిన్హాకు నిరాశ

అధికార ఇండియ కూటమి సీట్ల ఒప్పందంలో భాగంగా గర్వా జిల్లాలోని భావనాథ్ పూర్ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున టికెట్ ఆశించారు. అయితే, ఆ స్థానంలో జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM)కి దక్కింది. దీంతో మనస్ సిన్హా నిరాశచెందారు. మరోవైపు, భావనాథ్‌పూర్‌ కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉంది. అక్కడ్నుంచి కాంగ్రెస్ ఏడుసార్లు గెలిచింది. 2019లో బీజేపీలో చేరిన భాను పర్తాప్ షాహి ఈ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన ఇప్పుడు జేఎంఎంలో చేరిన మాజీ శాసనసభ్యుడు అనంత్ ప్రతాప్ డియోపై పోటీ చేస్తున్నారు. ఇకపోతే, 81 మంది సభ్యుల జార్ఖండ్ అసెంబ్లీకి నవంబర్ 13, నవంబర్ 20న రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 23న ఫలితాలు రానున్నాయి.

Advertisement

Next Story

Most Viewed