PAC Meeting: అరికపూడి అధ్యక్షతన పీఏసీ సమావేశం.. బహిష్కరించిన బీఆర్ఎస్ నేతలు

by Ramesh Goud |
PAC Meeting: అరికపూడి అధ్యక్షతన పీఏసీ సమావేశం.. బహిష్కరించిన బీఆర్ఎస్ నేతలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ(Telangan Assembly)లో ప్రజాపద్దుల కమిటీ సమావేశం(PAC Meeting) ప్రారంభమైంది. సమావేశానికి హాజరైన బీఆర్ఎస్ నేతలు(BRS Leaders) మీటింగ్ ను బహిష్కరించారు. సోమవారం అసెంబ్లీ కమిటీ హాల్‌లో పీఏసీ మీటింగ్ జరుగుతోంది. ఈ సమావేశానికి కమిటీ చైర్మన్‌గా(PAC Chairman) ఎన్నికైన అరెకపూడి గాంధీ(Arikepudi Gandhi) అధ్యక్షత వహిస్తున్నారు. ఈ సమావేశానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు(MLA's), ఎమ్మెల్సీలు(MLC's) హాజరయ్యారు. ఇందులో ప్రజా పద్దులపై ఎమ్మెల్యేల మధ్య పలు చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే పీఏసీ చైర్మన్ నియామకంపై నిరసన వ్యక్తం చేసిన బీఆర్ఎస్ నేతలు సమావేశాన్ని బహిష్కరించారు. మీటింగ్ కు హజరైన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి(Prashanth Reddy Vemula), ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్(Satyavathi Rathode), ఎమ్మెల్సీ ఎల్.రమణ(Ramana.L) మధ్యలోనే సమావేశం నుంచి బయటకి వచ్చారు. కాగా పీఏసీ చైర్మన్ పదవికి బీఆర్ఎస్ నుంచి నామినేషన్ వేసిన వారి పేర్లను పక్కన పెట్టి అరికపూడి గాంధీని ఎంపిక చేయడం పట్ల వివాదంగా మారిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed