ఫోన్ ట్యాపింగ్ తో హరీష్ రావుకు సంబంధం లేదు : ఎమ్మెల్యే

by Kalyani |
ఫోన్ ట్యాపింగ్ తో హరీష్ రావుకు సంబంధం లేదు : ఎమ్మెల్యే
X

దిశ,దుబ్బాక : కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయలేక, ప్రశ్నించే గొంతులను నొక్కివేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి బుధవారం పత్రిక ప్రకటన ద్వారా తెలిపారు. మాజీ మంత్రి హరీష్ రావు పై రేవంత్ రెడ్డి ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రభాకర్ రెడ్డి అన్నారు.కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ ని రాజకీయంగా ఎదుర్కోలేకనే రేవంత్ రెడ్డి చిల్లరగాళ్ళను ఉసిగొల్పుతు, అక్రమ కేసులు బుకాయించడం దుర్మార్గ పాలన అని పేర్కొన్నారు. హరీష్ రావుపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసే ముందు అవతలి వ్యక్తి విశ్వసనీయత గురించి పోలీసులు ఆలోచించరా‌ అని పేర్కొన్నారు.

తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన నాయకుడు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ శాసనసభ్యులు, పది సంవత్సరాలు మంత్రిగా పని చేసిన వ్యక్తి హరీష్ రావు ప్రజాసేవలో లక్షల మంది అభిమానులు సంపాదించుకున్న పబ్లిక్ లీడర్ వారి పై చిల్లర వీధి రౌడీలు ఇచ్చే కంప్లైంట్ లపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేస్తారా.? అంటూ పత్రిక ప్రకటన ద్వారా మండిపడ్డారు.బీఆర్ఎస్ పార్టీ పక్షాన రకరకాల ఆరోపణలతో కార్యకర్తలతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తాం, మీరు ఎఫ్ ఐ ఆర్ చేస్తారా? అని ప్రశ్నించారు. హరీష్ రావుపై ఇప్పటికే అనేక కేసులు పెట్టారు.ఇవన్నీ స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చిల్లర వ్వక్తులను ఉసిగొల్పి ఫిర్యాదులు ఇప్పించినవే. ఇలాంటి దిగజారుడు రాజకీయాలు మానుకోవాలన్నారు.

నేరచరిత్ర ఉన్న వాళ్ళు చెప్పిన మాటలు పోలీసులు వింటూ ఎఫ్ఐఆర్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులు అక్రమ కేసులు బనాయించడం శోచనీయం.రైతుబంధు, రైతు రుణమాఫీ, ఆరు గ్యారెంటీల అమలు గురించి అడిగితే హరీష్ రావు పై కక్షతో రాజకీయంగా ఎదుర్కోలేక అడ్డదారిలో రాజకీయం చేయడం సిగ్గుచేటు అని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ తో హరీష్ రావుకు సంబంధం లేదు, వారిపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్ని రాజకీయ కుట్రలు చేసిన హరీష్ రావు నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయలేరు అన్నారు. తెలంగాణ ఉద్యమంలో మీరు సంచులు మోసిన సమైక్య నాయకులు వందల కేసులు పెట్టిన భయపడని ధైర్యం హరీష్ రావుది‌ అని పేర్కొన్నారు. ఇలాంటి తాటాకు చప్పుళ్ళకు భయపడేది లేదు, ప్రజా క్షేత్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మిమ్మల్ని నిలదీస్తూనే ఉంటాం ప్రశ్నిస్తూనే ఉంటాం. తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి తక్షణమే హరీష్ రావుపై పెట్టిన తప్పుడు కేసును ఉపసంహరించుకోవాలని, బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అని ఓ పత్రిక ప్రకటన ద్వారా తెలిపారు.

Advertisement

Next Story