- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లోన్ యాప్ వేధింపులు.. యువతి ఆత్మహత్యాయత్నం
దిశ, సిద్దిపేట ప్రతినిధి: లోన్ యాప్ వేధింపులు యువతి ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన సిద్దిపేట టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట పట్టణానికి చెందిన ఓ యువతి లోన్ యాప్‌ల ద్వారా లోన్ తీసుకుని ప్రతి నెల లోన్ కడుతున్నప్పటికి ఫోటోలను మార్పింగ్ చేసి, కుటుంబ సభ్యులకు పంపిస్తూ.. మానసిక వేధింపులకు గురి చేస్తున్నట్లు తెలిపారు. దీంతో యువతి రెండు సార్లు ఆత్మహత్య యత్నానానికి ప్రయత్నించినట్లు తెలిపారు. ఈమేరకు యువతి సోదరుడు 1930 ఫోన్ చేసి ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్నేహితురాలి పేరిట వాట్సాప్ మెసేజ్‌లు పెట్టి సైబర్ నేరస్తులు బాధితుడి నుండి రూ.3 వేలు కాజేశారు. గజ్వేల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బ్యాంక్ అధికారుల మని నమ్మపలకి బాధితుడి ఖాతా నుండి రూ.7 వేలు, కుకునూరు పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బాధితుడి అకౌంట్ నుండి రూ.6 వేలు సైబర్ నేరస్తులు కాజేశారు. బాధితులు 1930కి ఫోన్ చేసి.. ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సీపీ శ్వేత వెల్లడించారు.