- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అత్యాశతో డ్రైవర్లు కటకటాల పాలు…
దిశ, పటాన్ చెరు: అర్ధరాత్రి ఐరన్ రాడ్ లోడ్‌తో వెళ్తు మధ్యలో డంపింగ్ చేస్తున్న నాలుగు లారీలను బీడీఎల్ బానూర్ పోలీసులు సీజ్ చేశారు. సీఐ రవీందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... బీడీఎల్ బానూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెలిమల సెయిల్ స్టీల్ పరిశ్రమ నుంచి అపర్ణ కల్పతరువు కన్స్ట్రక్షన్‌కు నాలుగు ఐరన్ రాడ్ లారీలు వెళ్లాల్సి ఉంది. వెలిమల శివారులోని ఒక సిమెంట్ బ్రిక్స్ పరిశ్రమలో అర్ధరాత్రి ఒక్కొక్క ట్రాలీ నుంచి సుమారు 300 నుంచి 500 కిలోల రాడ్స్‌ను లారీ డ్రైవర్లు చోరీ చేసేందుకు కొన్ని రోజుల నుంచి అన్లోడింగ్ చేస్తున్నారు. అక్రమంగా డబ్బులు సంపాదించాలనే దుర్బుద్ధితో డ్రైవర్లు ఈ కథకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో గురునాథ్ రెడ్డి రాజేష్ ఫిర్యాదు మేరకు అర్ధరాత్రి మోహన్ రెడ్డికి చెందిన సిమెంట్ బ్రిక్స్ పరిశ్రమలో అన్లోడ్ చేస్తుండగా నాలుగు ట్రాలీ వాహనాలను అదుపులోకి తీసుకున్న బానూర్ పోలీసులు సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. కాగా ఈ వ్యవహారంలో ఎవరు అన్లోడ్ చేస్తున్నారనే విషయం పై సమగ్ర విచారణ జరుగుతున్నట్లు సీఐ వెల్లడించారు.