- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాణ్యమైన విద్య, నాణ్యమైన భోజనం ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే
దిశ, మెదక్ ప్రతినిధి : నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పిల్లలకు అందించే డైట్, కాస్మోటిక్ ఛార్జీలు పెంపు ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా శనివారం మెదక్ జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల, కళాశాలలో పథకాన్ని ప్రారంభించి, డైట్ మెనూ చాట్ ఆవిష్కరించి విద్యార్థినులతో ఎమ్మెల్యే కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ… గుణాత్మక విద్య, నాణ్యమైన మెనూ అందించి ప్రభుత్వ విద్యాలయాల్లో కార్పొరేట్ స్థాయికి ధీటుగా విద్యను అభ్యసించాలని, ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ముందుకు పోతుందన్నారు.
వచ్చే పది ఫలితాల్లో 10/10 జీపీఏ సాధించాలని, అందుకు తగ్గట్లుగా కష్టంతో ఇష్టపడి చదవాలని, చదువును ఎట్టి పరిస్థితుల్లోనూ మానేయకూడదని, జీవితంలో ఉన్నత విలువలతో కూడిన లక్ష్యాలను ఛేదించాలని సూచించారు. అంతకు ముందు కొత్త డైట్ మెనూ బోర్డును విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో కలిసి శాసనసభ్యులు ఆవిష్కరించారు. అలాగే ఎస్ఓపీ హ్యాండ్ బుక్ ను విడుదల చేశారు. విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ పద్మావతి, ఇతర ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.