బతుకమ్మ ఏర్పాట్లలో ప్రభుత్వం విఫలం : హరీష్ రావు

by Aamani |
బతుకమ్మ ఏర్పాట్లలో ప్రభుత్వం విఫలం :  హరీష్ రావు
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : బతుకమ్మ పండుగ ఏర్పాట్లలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. బతుకమ్మ పండుగ పురస్కరించుకొని సిద్దిపేట కోమటి చెరువు వద్ద నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బతుకమ్మ పండుగ అందరి జీవితాల్లో ఆనందోత్సాహాలు కలిగించాలని ఆకాంక్షించారు. మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా నిర్వహించారన్నారు. బీఆర్ఎస్ పార్టీ మాజీ సీఎం కేసీఆర్ బతుకమ్మ పండుగకు ప్రపంచ వ్యాప్తంగా విశేషమైన ప్రచారం కల్పించారన్నారు. అమెరికాలో కూడా బతుకమ్మ పండుగను అధికారికంగా గుర్తించడం తెలంగాణ ప్రజలకు గర్వకారణం అన్నారు.

మాజీ సీఎం కేసీఆర్ హయాంలో బతుకమ్మ పండుగకు ప్రతి మహిళ కొత్త చీర కట్టు కోవలానే ఉద్దేశంతో బతుకమ్మ చీరలు పంపిణీ చేసినట్లు గుర్తు చేశారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ పండుగకు మహిళలకు చీరలు ఇవ్వలేదన్నారు. ఎన్నికల సందర్భంగా ఒక్క చీర కాదు రెండు చీరలు రూ. ౫ వందలు ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. ఇప్పుడు చీర లేదురూ. 5వందలు ఇవ్వలేదని మండిపడ్డారు. గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలకు నిధులు నిధులు విడుదల చేయక పోవడంతో కొంత ఇబ్బంది కలుగుతుందన్నారు. గ్రామాల్లో సర్పంచులు లేక పంచాయతీ కార్యదర్శులకు నిధులు విడుదల కాక బతుకమ్మ పండుగలకు గతంలో జరిగినంత ఘనంగా ఏర్పాట్లు చేయలేక పోయారని అన్నారు. మున్సిపాలిటీలకు పట్టణ ప్రగతి నిధులు, కొన్ని మున్సిపాలిటీలకు 15 ఫైనాన్స్ నిధులు రాక ఇబ్బంది జరుగింది అన్నారు.

Advertisement

Next Story

Most Viewed