నైపుణ్యంతో కావాల్సిన ఉద్యోగం పొందండి : మంత్రి పొన్నం

by Aamani |   ( Updated:2024-06-24 09:52:13.0  )
నైపుణ్యంతో కావాల్సిన ఉద్యోగం పొందండి : మంత్రి పొన్నం
X

దిశ,హుస్నాబాద్ : అర్హతలను బట్టి జాబ్ మేళాకు వచ్చిన ప్రతి ఒక్కరూ నైపుణ్యంతో కావాల్సిన జాబ్ ని పొందాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని తిరుమల గార్డెన్ లో నిర్వహించిన జాబ్ మేళాలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి తో కలిసి పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం మంత్రి జాబ్ మేళా ను ప్రారంభించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు .యువజన సర్వీసుల శాఖ తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాబ్ మేళా కు తరలివచ్చిన నిరుద్యోగ యువతకు స్వాగతం తెలిపారు. ఎక్కడ ఏ జాబ్ కావాలన్నా ఆయా గ్యాలరీలలో ఇంటర్వ్యూ కి అటెండ్ కావాలని కోరారు. అనుకున్న దానికంటే ఎక్కువ స్పందన రావడంతో ఎవరు చింతించాల్సిన పనిలేదని అసౌకర్యానికి గురి కావద్దని కోరారు. ముందు అనుకున్నట్లుగా గం.10 నుంచి 4 గంటల వరకే ఉన్నప్పటికీ సమయాభావం సరిపోకపోతే రాత్రి 10 గంటల వరకు అయినా జాబ్ మేళాకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఇక్కడే ఉండి ఓపికగా ఇంటర్వ్యూ కు అటెండ్ కావాలని అన్నారు.

నిరుద్యోగులకు దాదాపు అన్ని ఉద్యోగాలు వచ్చేలా అవకాశాలు కల్పించాలని నిర్వాహకులను కోరారు. ఇంతే కాకుండా పాల ఉత్పత్తి ,చేపల పెంపకం, గ్రామీణ పరిశ్రమలు కల్పించేలా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరారు. గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసి టూరిజం ద్వారా కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అన్నారు. అందరూ ఇంటర్వ్యూలో సఫలీకృతులైన అపాయింట్మెంట్ లెటర్ తో వెళ్లాలని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ జాబ్ మేళాలో ముందుగా శ్రీ కావ్య తో పాటు మరో నలుగురికి అపోలో కామర్స్ (25 వేల వేతనం) లో జాబ్ కి సెలెక్ట్ అవడం తో వారికి మంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. వారికి అపాయింట్మెంట్ లెటర్స్ అందజేశారు.

Advertisement

Next Story

Most Viewed