- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గౌరవెల్లి ప్రాజెక్టు భూనిర్వాసిత రైతు ఆత్మహత్యాయత్నం
దిశ,అక్కన్నపేట : సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి గ్రామానికి చెందినటువంటి నిర్వాసిత రైతు నందారపు సంపత్.. తన తండ్రి పేరు మీద ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని కొంతమంది రెవెన్యూ అధికారులు మార్పిడి చేసి మరొకరి పేరు మీద చేయించి పరిహారం కూడా పొందారని తెలుస్తోంది. దీనికోసం నిర్వాసితు రైతు నందారపు సంపత్ గత ఐదు ఏళ్ళుగా కాళ్లు అరిగేలా ఎమ్మార్వో ఆఫీస్ చుట్టూ తిరిగిన న్యాయం జరగడం లేదని తెలుస్తోంది. దీంతో ఆయన పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. అక్కన్నపేట మండలం గౌరవెల్లి రిజర్వాయర్ లో ముంపునకు భూమి సర్వే నెంబర్ 491/8 లో నందారపు వెంకటయ్య తండ్రి వీరయ్య పేరుతో 1 ఎకరం 10 గుంటల పట్టా భూమి ఉండేది. కొన్ని సంవత్సరాల పాటు దీన్ని సాగు చేసుకుంటూ వారు జీవనం సాగించారు.
ఇంతలో వెంకటయ్య అనారోగ్యం క్షీణించడంతో ఆయన మరణించారు. అదే అదునుగా భావించిన టువంటి అధికారులు ఈ భూమిని తారుమారు చేసి రికార్డుల్లో మరొకరి పేరు నమోదు చేసి పరిహారం నొక్కినట్టు తెలుస్తోంది. కొన్ని సంవత్సరాల నుంచి సంపత్ పరిహారం కోసం ఎమ్మార్వో ఆఫీస్ చుట్టూ ఎన్ని సార్లు తిరిగిన అధికారులు రేపు మాపు అంటూ కాలయాపన చేస్తూ వచ్చారు. దీంతో విసుగు చెందిన వెంకటయ్య కుమారుడు సంపత్ అక్కన్నపేట తహసిల్దార్ కార్యాలయం ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు రెవెన్యూ అధికారులు పురుగుల మందు బాటిల్ లాక్కొని తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
నాకు న్యాయం చేయాలి
గౌరవెల్లి రిజర్వాయర్ భూముల సర్వే సమయంలో రెవెన్యూ అధికారులు నన్ను పిలిచారు. నా భూమిని చూపించమని అడిగారు. నేను నా భూమి హద్దులు చూపించడంతో సర్వేలో నా పేరు రాశారు. ఆ తర్వాత ఆర్డీవో ఆఫీస్ పిలిచి కొన్ని సంతకాలు కూడా చేయించుకున్నారు. నీకు డబ్బులు వస్తాయని చెప్పారు. ఆ తర్వాత నెలలు గడిచిన నాకు చెక్కు అందించలేదు. చివరికి నా డబ్బులు ఎవరో తీసుకున్నారని తెలియడంతో వారు ఎవరో చెప్పమని ఎంత బ్రతిమలాడినా ఆఫీస్ వారు పట్టించుకోవడం లేదు. కటిక పేదరికంలో ఉన్నాను నాకు చావే శరణ్యం. స్థానిక ఎమ్మెల్యే మంత్రి అయినా పొన్నం ప్రభాకర్ నాకు న్యాయం చేయాలి అని నందారపు సంపత్ కోరారు.