రూ.50 లక్షల విలువైన గంజాయి పట్టివేత

by Shiva |   ( Updated:2023-04-09 15:17:10.0  )
రూ.50 లక్షల విలువైన గంజాయి పట్టివేత
X

వలస కార్మికులే టార్గెట్ గా దందా

దిశ, పటాన్ చెరు: వలస కార్మికులే టార్గెట్ గా కొనసాగుతున్న గంజాయి ముఠా గుట్టురట్టయింది. రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని కొల్లూరు రింగ్ రోడ్ వద్ద పని చేస్తున్న వలస కార్మికులకు సప్లై చేస్తున్న రూ.50 లక్షల విలువ గల 120 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేస్తుకున్నట్లు మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి వెల్లడించారు.

వివరాల్లోకి వెళితే.. భారీ ఎత్తున గంజాయి విక్రయిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు, రామచంద్రాపురం పోలీసులు సంయుక్తంగా కొల్లూరులో గంజాయి ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఒరిస్సా నుంచి పటాన్ చెరు కు గంజాయి తరలిస్తున్న ప్రధాన నింధితుడు ఒరిస్సాకు చెందిన దీపాకర్ తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకోగా అందులో ఒకరు పరారయ్యారని తెలిపారు. రెండు కార్లు, ఒక బైక్ తో పాటు నాలుగు మొబైల్ ఫోన్లు, స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ వెల్లడించారు.

Advertisement

Next Story