అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

by Disha Web Desk 22 |
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
X

దిశ, తూప్రాన్: గత కొంత కాలంగా తూప్రాన్ పట్టణం, ఇతర ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న మహారాష్ట్రకు చెందిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను గురువారం తూప్రాన్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ విషయాన్ని ఎస్పీ బాలస్వామి తూప్రాన్ పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన మీడియా సమావేశం లో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గత ఫిబ్రవరి 27న తూప్రాన్‌లో ఫంక్షన్‌కు హాజరు అయిన ఉప్పల శ్వేత అనే మహిళ తిరిగి హైదరాబాద్‌కు వెళ్తుండగా టోల్ ప్లాజా వద్దకు రాగానే హ్యాండ్ బ్యాగ్ చూసుకోగా అందులో ఉన్న 12.5 తులాల బంగారు ఆభరణాలు కనిపించలేదు అని ఆమె తూప్రాన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి పోలీసులు మూడు గ్రూప్‌లుగా విడిపోయి దర్యాప్తు నిర్వహించారు. తూప్రాన్ బైపాస్ ఆవరణలో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు మహారాష్ట్రకు చెందిన మారుతి వేగనార్ కారులో అనుమానాస్పదంగా తిరుగుతుండటం గమనించి వారిపై నిఘా పెట్టారు. గురువారం వారి ఫోన్ నెంబర్ కనుగొని ట్రాక్ చేసి పట్టుకుని విచారించగా వారు నిజం ఒప్పుకున్నారని తెలిపారు. వారి నుంచి 12.5 తులాల బంగారం, 6 మొబైల్ ఫోన్లు, ఒక మారుతి వేగనార్ కార్ స్వాధీనం చేసుకుని విచారించగా సంగారెడ్డి, సదాశివపేట రామాయంపేట అదే కాకుండా మహారాష్ట్రలో కూడా ప్రజలు రద్దీగా ఉండే ప్రదేశాలు లక్ష్యంగా చేసుకుని దొంగతలనుకు పాల్పడుతున్నారని తెలిపారు.

తూప్రాన్ పోలీసులకు అభినందనలు : ఎస్పీ బాలస్వామి

తూప్రాన్ పట్టణ, ఇతర ప్రాంతాల్లో ఇటీవల ఇష్టనుసారంగా రెచ్చిపోతున్న ఈ అంతర్రాష్ట్ర దొంగల ముఠాను చాకచక్యంతో పట్టుకున్న డీఎస్పీ సోము వెంకట్ రెడ్డి, సీఐ కృష్ణ ఎస్ఐ శివానందంను వారి టీ‌ను ఎస్పీ బాలస్వామి అభినందించారు.


Next Story

Most Viewed