అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

by Kalyani |
అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
X

దిశ, చిన్నశంకరంపేట: అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు పట్టుకుని శుక్రవారం రిమాండ్ కు తరలించిన సంఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట పోలీస్ స్టేషన్ లో, తూప్రాన్ డీఎస్పీ వెంకటరెడ్డి ,రామాయంపేట సీఐ వెంకట రాజా గౌడ్ తో కలిసి పోలీస్ స్టేషన్ చాంబర్లో మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి స్థానిక విలేకరుల సమావేశంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ… గత నెలలో తొమ్మిదవ తేదీన నాలుగు దొంగతనాలు జరిగాయని, ఎల్లారెడ్డి నియోజకవర్గం నాగిరెడ్డి పేట్, మెదక్ నియోజకవర్గం హవేలీ ఘనపూర్, చిన్నశంకరం పేట, చేగుంట మండలాల్లోని ఆలయాల్లో దొంగతనాలు జరిగాయన్నారు.

శుక్రవారం ఉదయం చిన్నశంకరంపేట మండలం గవ్వలపల్లి వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా,అనుమానస్పదంగా టాటా మంజా కార్ తప్పించుకొనే ప్రయత్నం చేశారని, అనుమానితులను పట్టుకుని విచారించగా, వారి వద్ద దేవుళ్ళకు సంబంధించిన బంగారు, వెండి, ఆభరణాలు దొరికాయన్నారు. మహారాష్ట్ర నాందేడ్ చెందిన అస్లాం, షేక్ ఇలియాస్, షేక్ సమీర్ ముగ్గురు దొంగలను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఆ ముగ్గురు పాత నేరస్థులేనని తెలిపారు. వారి వద్ద మూడు సెల్ ఫోన్, కార్, ఐదు లక్షల 50 వేల రూపాయల విలువచేసే బంగారు వెండి ఆభరణాల రికవరీ చేశామన్నారు. నెల రోజుల్లో దొంగలను పట్టుకోవడం పై పోలీసులను ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అభినందనందించి రివార్డ్ అందించారు. ఆలయాల్లో సీసీ కెమెరాలు అమర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట సీఐ రాజా గౌడ్, చిన్నశంకరంపేట ఎస్సై నారాయణ గౌడ్, తో పాటు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed