- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నీట్ లో గజ్వేల్ విద్యార్థుల జయకేతనం
దిశ, గజ్వేల్ /కొండపాక : రాష్ట్రంలో అత్యధికంగా మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేయడంతో గ్రామీణ విద్యార్థులు సైతం వైద్య విద్య కోర్సులను చదివేందుకు మక్కువ చూపుతున్నారని ఇది శుభ పరిణామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. వృత్తి విద్య కోర్సులను అభ్యసించే విద్యార్థులకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తుందన్నారు. గజ్వేల్ మండలం పిడిచేడ్ కు చెందిన పంగ శివ నందన్, పంగా అక్షరాలు నీట్ పరీక్షలో మెరిట్ సాధించి గాంధీ మెడికల్ కళాశాలలో ఉచిత సీట్లను పొందారు. ఈ సందర్భంగా విద్యార్థులను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. గజ్వేల్ జెడ్పీటీసీ పంగ మల్లేశం నాగరాణిల కుమారుడు పంగ శివ నందన్ కుమార్, కుమార్తె పంగ అక్షర వీణలు వీరిరువురు 2023-24 సంవత్సరంకు సంబంధించిన నీట్ పరీక్షలో మెరిట్ ర్యాంకు సంపాదించి గజ్వేల్ నుండి జయకేతనం ఎగురవేశారు.
ఈ ఇద్దరు విద్యార్థులకు గాంధీ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ విద్యను అభ్యసించేందుకు ఉచిత సీట్లు వచ్చాయి. మంత్రిని విద్యార్థులు మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. మంత్రి హరీశ్ రావు విద్యార్థులిద్దరికి పూలబొకేలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాగా చదువుకొని పేద ప్రజలకు సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి, వర్గల్ మండల్ జెడ్పీటీసీ బాలు యాదవ్, జగదేవ్ పూర్ మండల్ ఎంపీపీ బాలేశం గౌడ్ తదితరులు పాల్గొన్నారు. తమ గ్రామానికి చెందిన విద్యార్థులకు ఎంబీబీఎస్ సీట్లు రావడం తో పిడిచేడ్ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ, విద్యార్థులను అభినందిస్తున్నారు.