అశ్రునయనాలతో నాగరాజు అంత్యక్రియలు

by Shiva |   ( Updated:2023-04-03 14:33:56.0  )
అశ్రునయనాలతో నాగరాజు అంత్యక్రియలు
X

దిశ, పెద్ద శంకరంపేట్: మండల పరిధిలోని మల్కాపూర్ గ్రామానికి చెందిన విద్యుత్ ఆపరేటర్ నాగరాజు అంతక్రియలు సోమవారం తన స్వగ్రామంలో బంధువులు, గ్రామస్థులు, స్నేహితుల అశ్రునయనాల నడుమ అంత్యక్రియలు ముగిశాయి. విధి నిర్వహణలో భాగంగా రేగోడ్ మండలం టీ.లింగంపల్లి మీదుగా స్వగ్రామానికి వస్తున్న తరుణంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో నాగరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలిసిన వెంటనే మండలంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

గ్రామంలో చిన్న, పెద్ద తేడా లేకుండా అందరితో కలుపుగోలుగా ఉండే నాగరాజు యొక్క వ్యక్తిత్వాన్ని తలుచుకొని, అనాథలైన భార్య, పిల్లలను చూసి గ్రామస్థులు బోరున విలపించారు. నాగరాజు అంతిమయాత్రలో కేంద్ర ఫుడ్ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీనివాస్ గౌడ్, జడ్పీటీసీ విజయరామరాజు, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు బొండ్ల దత్తు, పెద్ద శంకరంపేట సర్పంచ్ అలుగుల సత్యనారాయణ, ఆయా పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, మిత్రులు, గ్రామస్థులు నాగరాజుకు కడసారి కన్నీటి వీడ్కోలు పలికారు.

Advertisement

Next Story