Thaneeru Harish Rao : ఏడో సారి..బరిలో తన్నీరు హరీష్ రావు

by Naresh |   ( Updated:2023-08-21 16:51:30.0  )
Thaneeru Harish Rao : ఏడో సారి..బరిలో తన్నీరు హరీష్ రావు
X

దిశ, సిద్దిపేట:ఉద్యమాల పురిటి గడ్డ సిద్దిపేట అసెంబ్లీ బరిలో తన్నీరు హరీష్ రావు 7 వ సారి ఎమ్మెల్యేగా పోటీచేయనున్నారు. తొలిదశ, మలిదశ ఉద్యమానికి వేదికగా నిలిచిన సిద్దిపేట నియోజక వర్గంలో డబుల్ హ్యాట్రిక్ సాధించిన హరీష్ రావు మరోసారీ విజయమే లక్ష్యంగా ముందకు సాగుతున్నారు. 2004 ఉప ఎన్నికలు మినహాయించి జరిగిన ఎన్నికల్లో ప్రత్యర్ధుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. 2010లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ పిలుపు మేరకు రాజీనామాలు చేయడంతో సిద్దిపేట నియోజక వర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి హరీష్ రావు పోటీచేసీ కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ అభ్యర్థులను ఓడించారు. తిరిగి 7వ సారి సిద్దిపేట నియోజక వర్గం నుంచి మంత్రి హోదాలో బరిలో దిగనుండటంతో నియోజక వర్గంలో హరీష్ రావు పైనే చర్చ సాగుతోంది. మంత్రి హరీష్ రావు మరోసారి సిద్దిపేట అభ్యర్థి గా ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తు సిద్దిపేట మంత్రి క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు.

Advertisement

Next Story