- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సాగు నీటి కోసం రైతుల రాస్తారోకో
దిశ, నంగునూరు: నంగునూరు పెద్దవాగు పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. దీంతో సాగునీరు లేక పంట పొలాలు ఎండిపోతున్నాయని రంగనాయక సాగర్ నుంచి సాగునీరు సకాలంలో వదలక పోవడంతో తమ పంట పొలాలు ఎండిపోతున్నాయని ఆగ్రహించిన రైతులు సిద్దిపేట- హనుమకొండ రహదారిపై రాంపూర్ క్రాసింగ్ వద్ద గణపురం, అక్కిన పల్లి గ్రామాల రైతులు సోమవారం నాడు రాస్తారోకో చేశారు. ఈ రాస్తారోకో వల్ల రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి. సుమారు గంటకు పైగా రాస్తారోకో చేసిన అనంతరం రాజగోపాల్ పేట ఎస్సై భాస్కర్ రెడ్డి అక్కడ చేరుకొని రైతులకు నచ్చచెప్పిన వినలేదు. దీంతో ఎస్‌ఐ ఇరిగేషన్ డీఈ చంద్రశేఖర్‌కు ఫోన్ చేయడంతో అతను అక్కడకు చేరుకున్నారు.
ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ… రంగనాయక సాగర్‌లో సరైన నీరు లేక విడవలేకపోతున్నామని సాగుకు సరిపోయే నీటిని రెండు మూడు రోజుల్లో పెద్ద వాగులోకి వదులుతామని తెలపడంతో రైతులు రాస్తారోకోను విరమింపజేశారు. రాస్తారోకో చేసిన రైతులకు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమిరెడ్డి నంగునూరు పీఎసీఎస్ చైర్మన్ రమేష్ మద్దతు పలికారు. ఈ రాస్తారోకోలో రైతులు సత్యనారాయణ రెడ్డి, సుధాకర్, రామ్ రెడ్డి, నాగేంద్రం, యాదగిరి సదానందంలతో పాటు 50 మంది రైతులు తదితరులు పాల్గొన్నారు.