- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతు సంక్షేమమే.. సీఎం కేసీఆర్ లక్ష్యం : ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి
దిశ, కొండపాక: రైతు సంక్షేమమే... సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర ఫారెస్ట్ డెవెలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. గురువారం కుకునూర్ పల్లి మండలంలోని తిప్పారం, బొప్పాయిపల్లి, మెదినిపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కోనుగోల కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాసంగిలో పండిన ప్రతి గింజను ప్రభుత్వం కొంటుందన్నారు.
రైతులు అకాల వడగండ్ల వర్షాలు పడి పంట నష్టం జరిగితే రైతులు ఇబ్బందికి గురి కావద్దన్నారు. పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం త్వరలోనే పంట నష్ట పరిహారం చెల్లిస్తుందన్నారు. రైతాంగానికి భరోసాగా రైతాంగానికి అండగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఉందన్నారు. అనంతరం మత్స్యకారులు చేపలు పడుతుండగా వారి వద్దకు వెళ్లి చేపలు పడుతున్న క్రమాన్ని పరిశీలించి వారి యొక్క ఆర్థిక స్థితిగతులు తెలుసుకున్నారు. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ ర్యాగల సుగుణ దుర్గయ్య, రైతు రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ దేవి రవీందర్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ అమరేందర్, గజ్వేల్ ఆత్మ కమిటీ చైర్మన్ ఊడెం కృష్ణారెడ్డి, తహసీల్దార్ ఆశాజ్యోతి, ఏపీఎం శ్రీనివాస్, సర్పంచ్ లు రాజయ్య, కోల శ్రీనివాస్, దశరథం, మహిపాల్, ఎంపీటీసీ హరిత సంతోష్ రెడ్డి, మండల కోఆప్షన్ మెంబర్ అజీముద్దీన్, సీనియర్ కిష్టారెడ్డి, తూము మహేందర్, కాసం నవీన్, రమేష్ రెడ్డి, అహ్మద్, ఐలయ్య, ఎల్లం, నర్సింహులు, బ్రహ్మం ఆత్మ కమిటీ డైరెక్టర్లు కనకయ్య, చిరంజీవి, సున్నం భాస్కర్, బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.